ఆ ఇద్దరితో బ్రేకప్…. కానీ “విఘ్నేశ్ శివన్” అంటే “నయనతార”కు ఎందుకంత ప్రత్యేకం..!?

ఆ ఇద్దరితో బ్రేకప్…. కానీ “విఘ్నేశ్ శివన్” అంటే “నయనతార”కు ఎందుకంత ప్రత్యేకం..!?

by Anudeep

లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలే ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండేవి. వీటన్నింటికీ తెర దించుతూ ఎట్టకేలకు ఇటీవల నయన్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను వివాహం చేసుకుంది. సాధారణంగా లవ్ బ్రేక్ అప్స్ తర్వాత వేరే వాళ్ళను వివాహం చేసుకున్నప్పుడు తన కంటే విఘ్నేష్ లో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటా అని తప్పక అనిపిస్తుంది.

Video Advertisement

శింబుతో నయనతార పరిచయం 2006 వల్లభ సినిమాతో స్టార్ట్ అయింది. కొంతకాలానికి ఆ లవ్ స్టోరీ బ్రేక్ అయిపోయింది. అనంతరం 2009లో ప్రభుదేవాతో పరిచయం ప్రేమగా మారి.. పెళ్లి వరకు వెళ్లి ఆగిందని పుకార్లు కూడా ఉన్నాయి. 2015లో వచ్చిన నేనూ రౌడీ నే అనే సినిమాకు విఘ్నేష్ డైరెక్టర్ కాగా నయనతార హీరోయిన్.

అలా ఏర్పడిన పరిచయం , ఏడేళ్ల ప్రేమ అనంతరం నేడు మూడు ముళ్ల బంధంలో ఒక్కటయ్యారు. నయనతార కంటే విఘ్నేష్ శివన్ ఒక యేడాది చిన్నవాడు. నయన్‌ను పెళ్లి చేసుకోక ముందు విఘ్నేష్ ఆమెకు పెద్ద ఫ్యాన్. అంతేకాదు ఆయన మల్టీ టాలెంటెడ్. విఘ్నేష్ డైరెక్టర్ కాక ముందు పాటల రచయతగా తన సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు. తమిళంలో 50 పైగా పాటలు రాసారు. విఘ్నేష్ శివన్ కేవలం సాహిత్యకారుడే కాదు.. ఈయన కెరీర్ ప్రారంభంలో పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌కు సంగీతం అందించాడు.

కేవలం లిరిసిస్ట్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా, డైరెక్టర్‌గా, నిర్మాతగానే కాక యాక్టర్‌గా కూడా సత్తా చాటారు విఘ్నేష్ శివన్. సివి, పోడా పోడి, వంటి చిత్రాల్లో ఈయన తన యాక్టింగ్‌తో అదరగొట్టారు. పోడాపోడి చిత్రానికి విఘ్నేషే దర్శకుడు కావడం విశేషం. నేనూ రౌడీ నే సినిమా నుంచి నయనతార కథల ఎంపిక విషయంలో విఘ్నేష్ సాయం చేస్తూ వచ్చాడు. రాజా రాణి’ చిత్రం నుంచి నయనతార మళ్లీ పుంజుకోవడం మాత్రమే కాకుండా ఆమె లేడీ సూపర్ స్టార్‌గా ఎదగడంలో ఇతని కృషి ఎంతో ఉంది.

వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డ తర్వాత నయనతారకు సంబంధించిన అన్ని విషయాలను విఘ్నేష్ దగ్గరుండి చూసుకునేవాడు. ఏదైనా సినిమాలో నయనతార నటించాలంటే ముందుగా ఈ కథ విఘ్నేష్‌కు నచ్చితేనే.. నయనతార దగ్గరకు వెళ్లేది. అప్పుడు కానీ ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లేది కాదు. ఇక నయనతారతో పెళ్లి గురించి విఘ్నేష్ ఇంట్లో వాళ్లను ఒప్పించడమే కాకుండా.. అందుకోసం దాదాపు ఏడేళ్లుగా ఎదురు చూసి చివరకు తన ప్రేమను సుఖాంతం చేసుకున్నాడు.

గత ఏడేళ్లలో వ్యక్తిగత, సినిమా వ్యవహారాలన్నింటిలో నయన్ కి విఘ్నేష్ తోడుగా నిలిచాడు. నయన్ ని పూర్తిగా అర్థం చేసుకొని కేవలం ఓ ప్రేమికుడిగా మాత్రమే మిగిలిపోకుండా జీవిత భాగస్వామి అయ్యాడు విఘ్నేష్ శివన్.


You may also like