విజయశాంతి అందుకే బాలయ్య బాబుతో నటించలేదా..? “నిప్పురవ్వ” సినిమా టైంలో ఏమి జరిగిందంటే..?

విజయశాంతి అందుకే బాలయ్య బాబుతో నటించలేదా..? “నిప్పురవ్వ” సినిమా టైంలో ఏమి జరిగిందంటే..?

by Anudeep

Ads

నందమూరి బాలకృష్ణ-విజయశాంతి లది 80 లలో హిట్ పెయిర్. వారి కాంబోలో వచ్చిన చాలా మూవీస్ హిట్ అయ్యాయి. 1980 లలో వీరి సినిమాలు సూపర్ హిట్ అవడంతో పాటు వీరి పెయిర్ కి కూడా మంచి పాపులారిటీ వచ్చింది. వీరిద్దరూ జంటగా నటించిన సినిమాలు కనీసం 17 వరకు ఉంటాయి.

Video Advertisement

balakrishna vijayasanthi

వీరి కాంబోలో సినిమా వస్తోంది అంటే అది పక్కా హిట్ అవుతుంది అనే టాక్ ఉండేది. నిర్మాతలకు కూడా వీరి కాంబోలో సినిమా అంటే కాసుల పంట అన్నట్లు ఉండేది. ఒక్క 1993 వ సంవత్సరం లోనే వీరిద్దరూ మూడు సినిమాల్లో కలిసి నటించారు. వీరిద్దరూ జంటగా నటించిన “నిప్పురవ్వ” సినిమా కూడా అదే ఏడాది రిలీజ్ అయింది. ఆ తరువాత వీరిద్దరూ ఏ సినిమాలోనూ కలిసి నటించలేదు.

balakrishna

హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న వీరిద్దరూ కలిసి నటించకపోవడంతో అప్పట్లో చాలానే రూమర్స్ వచ్చాయి. “నిప్పురవ్వ” సినిమా షూటింగ్ టైం లో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని పుకార్లు వచ్చాయి. దాదాపు మూడు దశాబ్దాల పాటు వీరి గురించి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. వీటిగురించి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఓ సారి ఇంటర్వ్యూ లోనే విజయశాంతి ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు.

vijayasanthi 2

ఆ సినిమా తరువాత తన ఇమేజ్, రెమ్యునరేషన్ పెరిగాయని.. అందుకే ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలపై ఫోకస్ చేయాలనుకున్నానని అందుకే బాలయ్యబాబు తో మళ్ళీ నటించలేదని చెప్పుకొచ్చారు. వారిద్దరి మధ్య ఎలాంటి విబేధాలు చోటు చేసుకోలేదని ఆమె వివరణ ఇచ్చారు.


End of Article

You may also like