4 ఏళ్ల క్రితమే ఎంగేజ్మెంట్ అయినా…”విజయ్‌కాంత్” కొడుకు పెళ్లి ఇంకా ఎందుకు అవ్వలేదు.? కారణం అదొకటేనా.?

4 ఏళ్ల క్రితమే ఎంగేజ్మెంట్ అయినా…”విజయ్‌కాంత్” కొడుకు పెళ్లి ఇంకా ఎందుకు అవ్వలేదు.? కారణం అదొకటేనా.?

by kavitha

Ads

కోలీవుడ్‌ లెజెండారీ యాక్టర్, డీఎండీకే అధినేత విజయ్‌కాంత్ డిసెంబర్‌ 28న మరణించారు. శుక్రవారం రోజున కొద్దిమంది సమక్షంలో అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. కొన్నేళ్ళ క్రితం అనారోగ్యంతో  విజయకాంత్ రాజకీయాలకు దూరంగా ఉంటూ, ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.

Video Advertisement

పూర్తి విశ్రాంతిలో ఉన్న విజయ్‌కాంత్ గత కొన్నేళ్ల నుండి అనారోగ్యంతో తరచూ హాస్పటల్ లో చేరుతున్నారు.ఈ క్రమంలోనే డిసెంబర్‌ 26న హాస్పటల్ లో చేరిన ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ 28న తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యం ఆయనకు సంబంధించిన విషయలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వాటిలో ఆయన కుమారుని వివాహ వాయిదా ఒకటి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

కెప్టెన్ విజయ్‌కాంత్ మరణం అనంతరం ఆయన గురించి అనేక ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాటివల్ల ఆయన గురించి ఎన్నో విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆయన ప్రేమలత ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు. విజయ్ ప్రభాకరన్ పెద్ద అబ్బాయి, షణ్ముఖ పాండ్యన్ చిన్న కొడుకు. 2019 లో విజయ్ ప్రభాకరన్ కి కోయంబత్తూర్ కి చెందిన వ్యాపారవేత్త  కుమార్తె కీర్తనతో నిశ్చితార్థం జరిగింది.

ఆ సమయంలో విజయ్‌కాంత్ అనారోగ్యంతో హాజరు కాలేకపోయారు. నిశ్చితార్థం జరిగి ఇన్ని ఏళ్ళు కావస్తున్నా, వారి వివాహం మాత్రం జరగలేదు. దాంతో వీరి పెళ్లి క్యాన్సల్ అయిందని రూమర్స్ షికారు చేశాయి. అయితే కెప్టెన్ సన్నిహితుల ప్రకారం,  వారి ఎంగేజ్మెంట్ జరిగిన కొన్ని నెలల్లో కరోనా మహమ్మారి కారణంగా వారి పెళ్లి విషయంలో చాలా మార్పులు జరిగాయని అంటున్నారు. కరోనా తగ్గిన తగ్గిన తర్వాత మళ్ళీ వివాహం జరిపించాలనుకుంటే ప్రధాని మోదీ కి ఆ వివాహానికి హాజరు అవడం కుదరలేదు.

విజయ్‌కాంత్ తన కుమారుని పెళ్లిని ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగాలని కోరుకున్నారట. కానీ ఆ టైమ్ లో బిజీగా ఉండటంతో పెళ్లికి మోదీ డేట్స్ కేటాయించలేకపోయారు. అలా 2022లో వారి  పెళ్లి జరుగలేదు. అనంతరం మోదీ ఒకే చెప్పినా విజయ్‌కాంత్ ఆరోగ్యం బాగా క్షీణించడంతో చికిత్స  కోసం అమెరికాకు వెళ్లడం లాంటి పలు కారణాలతో ఆ వివాహం వాయిదా పడుతూ వచ్చింది. చివరికి విజయ్‌కాంత్ అదే కరోనాతో మరణించారు.

 


End of Article

You may also like