Ads
మన సమాజంలో ఒక మహిళా సింగిల్ గా ఉండాలి అంటే ఎన్నో కష్టాలు మరియు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.ముఖ్యంగా చాలా ఒత్తిడికి గురవుతారు.
Video Advertisement
ఉదాహరణకు ఆ మహిళ ఎప్పుడు ఇంటికి చేరుతుంది మరియు ఇంటి నుండి బయటకు ఎప్పుడు వెళుతుంది, ఎలాంటి బట్టలు వేసుకుంటుంది మరియు సమాజం ఎలాంటి మాటలు మాట్లాడినా ఏమి అనని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మన భారతదేశంలో ప్రతి ఒక్క మహిళ తమ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటారు. దానితో పాటు మంచి సంస్కారాన్ని అందరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు.
అసలు ఒంటరిగా ఉన్న మహిళల జీవితం గురించి ప్రతి ఒక్కరూ ఎందుకు ఇంటర్ ఫియర్ అవ్వాలి..? ఒత్తిడికి గురి చేసే మాటలు ఎందుకు మాట్లాడాలి..?
సింగిల్ గా ఉన్న మహిళలు తరచుగా కొన్ని ప్రశ్నలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా మీరు పెళ్లి చేసుకునేందుకు సరైన సమయం ఇదే అని తరచుగా చెబుతూ ఉంటారు. ఆమె ఒంటరిగా ఉన్నా సరే స్వయంగా కష్టపడి సంపాదిస్తుంది. కాకపోతే సమాజానికి మరియు సోషల్ మీడియాకి ప్రతీదీ చెప్పుకోవడం కుదరదు కదా.
ఎందుకంటే సమాజంలో ఉండే స్నేహితులు మరియు బంధువులు క్రమంగా క్షుణ్ణంగా తమ జీవితాలను పరిశీలిస్తూ ఉంటారు. కానీ వారికి అస్సలు సంబంధం ఉండదు. చాలా మంది పెళ్లి కాని అమ్మాయిలకు ఇటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. సామాజిక మాధ్యమాల్లో మీరు ధరించే దుస్తుల నుండి సోషల్ మీడియాలో పెట్టే ఫోటోలు వరకు ప్రతి దాన్ని గమనించడం జరుగుతుంది.
పెళ్లి కాని అమ్మాయిలే కాదు పెళ్లి అయినా కూడా సోషల్ మీడియాలో ఎటువంటి వాటిని పోస్ట్ చేయడానికైనా రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ అసలు సంగతి ఏమిటంటే పెళ్లి కానీ అమ్మాయిలు తమ జీవితం గురించి ఎవరికీ జవాబు ఇవ్వనవసరం లేదు. తమకు నచ్చిన విధంగా తమ జీవితాన్ని ఆనందించవచ్చు. పెళ్లి చేసుకోవాలా లేక ప్రేమించాలా అనేది వాళ్లు నిర్ణయించుకోవడం పై ఆధారపడి ఉంటుంది.
వాళ్ళకి నచ్చిన విషయాల గురించి ఒంటరిగా జీవిస్తున్నారు, అంతమాత్రాన వారి ఆనందాన్ని వారు చూసుకోకుండా ఉండరు కదా.ఒకవేళ మనం నిజంగా వారి గురించి ఆలోచిస్తున్నట్లు అయితే వారి అభిప్రాయాన్ని గౌరవించి ఆలోచనలను మెచ్చుకోవాలి. అంతే కానీ ఎలాంటి సమయంలో కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అందరూ ఈ విధంగా ఆలోచిస్తే సమాజం ఎలా ఉంటుందో తెలపండి.
End of Article