పెద్ద వయసు ఉన్న వాళ్ళనే అమ్మాయిలు కోరుకుంటున్నారు.. వాళ్లలో అమ్మాయిలని ఆకర్షించే 5 లక్షణాలు ఇవే.!

పెద్ద వయసు ఉన్న వాళ్ళనే అమ్మాయిలు కోరుకుంటున్నారు.. వాళ్లలో అమ్మాయిలని ఆకర్షించే 5 లక్షణాలు ఇవే.!

by Harika

Ads

సాధారణంగా అమ్మాయిలు ఎలాంటి వాడిని పెళ్లి చేసుకుంటావు అని అడిగితే లక్షల్లో జీతాలు, విల్లాలలో కాపురాలు లగ్జరీ లైఫ్ ఇచ్చే భర్తని కోరుకుంటారు. అది ఒకప్పుడు కానీ ఇప్పుడు చాలామంది అమ్మాయిల అభిప్రాయం మారుతూ వస్తోంది. ఇప్పుడు ఇలాంటివి లేకపోయినా పర్వాలేదు కానీ అర్థం చేసుకునే భర్త దొరికితే చాలు అని అమ్మాయిలు కోరుకుంటున్నారు. వయసుతో కూడా సంబంధం లేకుండా తమ కంటే వయసులో చాలా పెద్దవారు అయినా కూడా పర్వాలేదు అని అనుకుంటున్నారు.

Video Advertisement

representative image, image source: marriage contract short film

అసలు ఒక రకంగా చెప్పాలి అంటే అమ్మాయిలు ఎక్కువగా వారినే ఇష్టపడుతున్నారు. అసలు అమ్మాయిలు అలాంటి వాళ్ళని ఇష్టపడటానికి గల కారణాలు ఏమిటి ఒకసారి చూద్దాం.

#1. తమకంటే వయసులో పెద్దవారు అయినవారు తమ భార్యలను బాగా చూసుకుంటారు అనే ఒక నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే వయసు పెద్దగా ఉన్న మగవాళ్ళు అప్పటికే చాలా జీవితాన్ని చూసి ఉంటారు. అలాంటి ఒక వ్యక్తి పిల్లలు పెంపకం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. తమకి ఉన్న జ్ఞానాన్ని తమ పిల్లలకు కూడా పంచుదాం అనే ఆలోచన కలిగి ఉంటారు.

#2. లోకజ్ఞానం తెలియని ఒక ఆడపిల్లని వయసులో పెద్దవారైన ఒక వ్యక్తి చాలా జాగ్రత్తగా చూసుకోగలరు. ఆ మెచ్యూరిటీ కుర్ర కారులో ఎంత వెతికినా కనిపించదు.

#3. అలాగే యువతులు ఎందుకు మానసికంగా పరిణితి చెందిన పురుషులను ప్రేమిస్తారు అని ఒక టాపిక్ వచ్చినప్పుడు చాలామంది వయసు ఎక్కువగా మగవాళ్ళకి పరిణితి జ్ఞానం ఎక్కువగా ఉంటుంది, ఆధ్యాత్మిక సున్నితత్వం ఉంటుంది అలాగే అటువంటి వ్యక్తులు ఎక్కువగా ప్రగల్బాలు పలకరిని చెప్తున్నారు అమ్మాయిలు.

#4. అలాగే ఇలా వయసులో పెద్దవారైన పురుషులు ఆడవాళ్ళని ఎలా ఆకర్షించాలో బాగా తెలిసిన వాళ్ళు అయి ఉంటారు. అలాగే పరిణితి చెందిన పురుషులు జీవితాన్ని తీవ్రంగా పరిగణిస్తారు. వారు తమ సహచరికి సౌకర్యవంతమైన జీవితాన్ని ఇవ్వటానికి ప్రయత్నిస్తారు.

#5. ఇంకొక అతి ముఖ్యమైన కారణం ఒక ఇలా వయసులో పెద్దవారైన వ్యక్తి తన కన్నా బాగా చిన్నదైన భార్య యొక్క కోపతాపాలను అర్థం చేసుకుంటాడు పైగా వాగ్వాదానికి తావివ్వడు. ఈ లక్షణాలే అమ్మాయిలని ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి అని చెప్తున్నారు రిలేషన్ ఎక్స్పర్ట్స్.


End of Article

You may also like