Ads
భార్య భర్తలన్నాక కలహాలు సహజమే. నిజానికి కలహాలు లేకపోతే ఆ కాపురంలో మజా ఉండదు. ఎంత పెద్ద గొడవలు జరిగినా మళ్లీ కలిసి కలకాలం బ్రతకడమే భార్యాభర్తల బంధం. అయితే కొందరు దంపతులు కలహాల కోసమే కాపురం చేస్తున్నట్లు ఉంటారు.
Video Advertisement
ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేయటం, గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తీసుకురావడం, భాగస్వామిని విపరీతమైన ఒత్తిడికి గురి చేయటం చేస్తూ ఉంటారు. ఇలాంటి గొడవలు వల్ల కాపురాలు కూలిపోతాయి.
ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం తెగిపోవడానికి చిన్నమాట చాలు భార్యాభర్తల మధ్య ఎంత పెద్ద గొడవ జరుగుతున్నప్పటికీ కొన్ని పదాలు మాట్లాడితే ఎదుటి వ్యక్తి మరింత ఆగ్రహానికి లోనవుతాడు. అందుకే ఎంత కోపం లో ఉన్నా సంయమనం పాటించండి. మీ భాగస్వామిని నోరుముయ్యు అనే మాట ఎప్పుడూ మాట్లాడకండి. ఎందుకంటే ఎదుటి వ్యక్తికి పట్టరాని కోపం రావడానికి ఈ ఒక్క మాట చాలు. అలాగే నేను చెప్పవలసింది నేను చెప్పాను ఆపై నీ ఇష్టం అని కూడా చాలామంది అంటూ ఉంటారు.
అప్పుడు ఎదుటి వ్యక్తి సంయమనాన్ని కోల్పోతాడు. ఎందుకంటే అవతలి వ్యక్తికి కూడా ఆలోచించే శక్తి నిర్ణయం తీసుకునే హక్కు ఉంటాయి కాబట్టి మీ అభిప్రాయాలని అవతల వాళ్ళ మీద రుద్దకండి వాళ్లకు నచ్చినది మీకు ఎలాంటి ఇబ్బంది రానంతవరకు చేయనివ్వండి. అలాగే నెపాన్ని ఎప్పుడు ఎదుటి వ్యక్తి మీద తోయ్యకండి. సాధారణంగా ఒక సమస్యకి ఇద్దరు కారణమవుతారు కాబట్టి ప్రతి గొడవకి నువ్వే కారణం అంటూ తప్పుని ఎదుటి వాళ్ళ మీదికి తోసేయకండి.
అలాగే ఎదుటి వాళ్లు బాధ చెప్పుకుంటున్నప్పుడు మీరు మౌనం పాటించకండి. వాళ్ల బాధని వాళ్ళ కష్టాన్ని వింటే, అర్థం చేసుకుంటే సగం గొడవ దూరమైనట్లే. అలా కాకుండా వాళ్ళు ఆవేశంలో ఒక మాట అన్నప్పుడు మీరు కూడా ఆవేశంగా ఒక మాట అంటే ఆ గొడవ పెరుగుతుంది కాబట్టి తగినంత సంయమనం పాటించి సంసారాన్ని నిలబెట్టుకోవటం ఉత్తమం
End of Article