Ads
భార్యా భర్తలు కలకాలం కలిసి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ వుంటారు. ఒకరినొకరు గౌరవించుకుంటూ ఆనందంగా ఉండాలని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశపడుతుంటారు. పైగా ఇద్దరూ కలిసి ఒక ఇల్లు కట్టుకోవాలని.. పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని… ఇలా భార్య భర్తల జీవితంలో కోరికలు ఉంటాయి. అయితే భార్యాభర్తలు ఒక విషయాన్ని అసలు మర్చిపోకూడదు.
Video Advertisement
ఎప్పటికీ భార్యాభర్తలు పాలు నీళ్లలా కలిసి ఉండాలి అయితే ఏ భార్యా భర్తల మధ్య అయినా సరే గొడవలు వస్తూ ఉంటాయి ఏదో ఒక సమస్య మీద ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళు కలిసి కలకాలం జీవించేందుకు చూడాలి. మూడవ వ్యక్తి కి చోటు ఇవ్వద్దు. ఎప్పుడు కూడా భార్యా భర్తలు వారి సంభాషణ మధ్య లో మూడో వ్యక్తికి చోటు కల్పించకండి. మూడవ వ్యక్తి కనుక మధ్యలోకి వస్తే భార్యాభర్తల మధ్య సమస్యలు పెద్దవవుతాయి తప్ప తరగవు. పైగా నలుగురిలో నవ్వుల పాలు అయిపోతారని గ్రహించాలి.
భార్య భర్తలు ఈ తప్పులను చేయకండి:
#1. గౌరవం ఇవ్వాలి:
చాలా మంది భార్యా భర్తలు ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉంటారు గౌరవం అసలు ఇవ్వరు కానీ ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యము.
#2. కంప్లైంట్లను చేయకండి:
చిన్న మాటకి కూడా కొంతమంది ఆడవాళ్లు పుట్టింటి వాళ్ళకి చెప్పడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే మీకు మీరే సమస్యని పరిష్కరించుకుంటూ ఉండండి ఫిర్యాదుని చేసి సమస్యని పెద్దది చేయొద్దు.
#3. అవగాహనతో ఉండండి:
మీ భార్యకి కానీ మీ భర్తకి కానీ సపోర్ట్ చేయడం కూడా ముఖ్యం. మీరు వచ్చిన సమస్య మీద అవగాహన కలిగి ఒకరి కోసం ఒకరు జీవిస్తున్నామని గుర్తుపెట్టుకుని… ఎప్పుడూ కూడా ఏకాభిప్రాయానికి రావాలి.
#4. ఇతరులతో కంపేర్ చేసుకోకండి:
వారు ఇలా ఉన్నారు.. వారు అలా ఉన్నారు అని ఎప్పుడూ కూడా మీరు ఇతరులతో కంపేర్ చేసుకోవద్దు ఇలాంటి తప్పులు భార్యాభర్తలు చేయడం వలన వాళ్ళ బంధం ముక్కలైపోయే ప్రమాదం ఉంది.
End of Article