Ads
ఎవరి బతుకు బండి అయినా ముందుకు నడవాలంటే ముఖ్యంగా అవసరమైనది డబ్బు. డబ్బు లేకపోతే ఏ చిన్న పని కూడా జరగదు. మనల్ని మనం పోషించుకోవాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం చేయవలసి ఉంటుంది. దీనికోసం అనేక జాబ్ ప్రయత్నాలు చేస్తూ విసుగుపోతుంటాం.
Video Advertisement
అయితే ఇక్కడ మాత్రం భార్యాభర్తలిద్దరు తమ ఉపాధి కోసం కలిసి వినూత్నంగా ఒక ప్రయత్నం మొదలుపెట్టారు. వాళ్లు చేసిన ఈ వినూత్న ప్రయత్నమే వైరల్ గా మారింది. ఇంతకీ ఏంటి ఈ వినూత్న ప్రయత్నం అనుకుంటున్నారా.. అయితే మీరు కూడా చూడండి..
ఆమె పేరు లారా యంగ్. నా భర్తని అద్దెకివ్వబడును అంటూ ” రెంట్ మై హ్యాండీ హస్బెండ్” అనే పేరుతో ఒక వెబ్ సైట్ ను ప్రారంభించింది. భర్తకు ఇంటికి సంబంధించిన అన్ని పనులు అలవాటు చేసింది. అంతేకాదు ఆమె భర్త జేమ్స్ కూడా ఇంట్లో ఉండే అనవసరమైన వస్తువులతో రకరకాల ఫర్నిచర్ తయారు చేయడం వంటివి నేర్చుకున్నారు. మొదటిలో ఇతనికి ఇన్ని పనులు వచ్చు అంటే ఎవరు నమ్మేవారు కాదు.
దీనితో అతను తన ఇంటిలోని పనికిరాని కలపతో డైనింగ్ టేబుల్ వంటివి తయారు చేయడం, ఇంటిని మంచిగా డెకరేట్ చేయడం, తన ఇంటి ఆవరణలో ఉన్న గార్డెన్ ని మంచిగా డెకరేట్ చేయడం వంటి పనులు చేసేవాడు. దీనితో వారి చుట్టుపక్కల ఉన్న వారు లారా భర్త జేమ్స్ టాలెంట్ ను గుర్తించారు.
లారా ఇంటి పనుల కోసం భర్తను అద్దెకు ఇస్తుంది అని తెలుసుకున్నవారు. ఇంటి పనుల కోసం లారా భర్తను రెంట్ కి తీసుకుంటున్నారు. దీని కోసమే ఈ భార్యాభర్తలు దాదాపు 35 పౌండ్లను వరకు వసూలు చేస్తారు. అంటే ఒక రోజుకు దాదాపు 3500 రూపాయలు రెంట్ కు తీసుకున్నవారి దగ్గర నుంచి వసూలు చేస్తారు. దీని ద్వారా వాళ్లు అధిక మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారు. ఇప్పుడు లారా చేసిన ఈ వినూత్న ప్రయత్నం కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
End of Article