Ads
ప్రియుడు మోసం చేసాడని, భర్త కాపురానికి రానివ్వట్లేదని పోలీసులను ఆశ్రయించడం చూసాం కానీ ఇక్కడ రివర్స్ లో భర్త.. భార్య తనతో కలిసి ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులును ఆశ్రయించాడు ఓ భర్త. అసలేం జరిగిందంటే..
Video Advertisement
ఇద్దరూ పబ్లిక్ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ.. పరిచయం అయ్యారు. తర్వాత అది ప్రేమగా మారింది. తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పి.. పెళ్లి చేసుకున్నారు.ఆ తర్వాత అతడికి భార్య షాకిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన మిథున్ కుమార్ తన చదువు పూర్తైన తర్వాత పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ మొదలు పెట్టాడు.
హర్‌ప్రీత్ అనే యువతి కూడా ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతోంది. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఇద్దరూ స్థానికంగా ఓ రూమ్‌ను అద్దెకు తీసుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. అనంతరం తమ ప్రేమను కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వారి అంగీకారంతో గత ఏడాది వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత హర్‌ప్రీత్‌కు కానిస్టేబుల్ ఉద్యోగం రాగా.. మిథున్ కుమార్‌కు మాత్రం నిరాశే ఎదురైంది.
తనకు ఉద్యోగం రాకపోయినా.. భార్యకు ఉద్యోగం వచ్చినందుకు అతడు సంతోష పడ్డాడు. కానీ ఆ తర్వాతే.. హర్‌ప్రీత్ తన భర్తను దూరం పెట్టడం మొదలు పెట్టింది. భార్య తీరుతో ఒక్కసారిగా కంగుతిన్న అతడు.. హర్‌ప్రీత్‌ను ప్రశ్నించాడు. దీంతో ఆమె ‘నీతో కలిసి ఉండటం ఇష్టం లేదని’ తేల్చి చెప్పింది. మిథున్ చేసేది లేక పోలీసులను ఆశ్రయించాడు. తన భార్యతో తనతో కలిసి ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులును వేడుకున్నాడు.
హర్‌ప్రీత్ ప్రిపరేషన్ కోసం సుమారు రూ.10-15లక్షలు ఖర్చు చేసినట్టు తెలిపాడు. అయితే హర్‌ప్రీత్ మాత్రం అతడి మాటలను ఖండించింది. రూ.25లక్షలు కావాలంటూ తన భర్త డిమాండ్ చేసినట్టు ఆరోపించింది. డబ్బులు ఇవ్వకపోతే తనను చంపేస్తానంటూ బెదిరింపులకు కూడా పాల్పడ్డాడని తెలిపింది. అంతేకాకుండా తన భర్తకు మరో యువతితో అక్రమ సంబంధం ఉందని ఆరోపణలు చేసింది హర్ ప్రీత్.
End of Article