వికీ కల్చరల్ ఫోటో కాంపిటీషన్…ప్రత్యేక చిత్రాలను అప్లోడ్ చేసి బహుమతులను పొందండి

వికీ కల్చరల్ ఫోటో కాంపిటీషన్…ప్రత్యేక చిత్రాలను అప్లోడ్ చేసి బహుమతులను పొందండి

by Anudeep

Ads

ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ” వికీ లవ్స్ మోన్యుమెంట్స్ 2021 ఇన్ ఇండియా ( Wiki loves monuments 2001 in India ) “, ఈ పోటీలో ఎలా పాల్గొనాలో, దీనికి కావాల్సిన అర్హతలు వీటి గురించి తెలుసుకునే ముందుగా అసలు అంటే ఏమిటో వివరంగా తెలుసుకుందా. ఈ పోటీలను 2010వ సంవత్సరంలో వికీపీడియా కమ్యూనిటీ వారు ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించారు. ఈ పోటీలు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మొదటి తారీకు నుంచి 30వ తారీకు వరకు జరుగుతూ ఉంటాయి. ప్రపంచంలోని వివిధ రకాల సంస్కృతి, నాగరికత కు సంబంధించిన చిత్రాలను ఇలా పోటీలు ద్వారా గ్రహించి వాటి గురించి ప్రపంచవ్యాప్తంగా అందరూ తెలుసుకునే విధంగా చేయడమే ఈ పోటీల యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పోటీలలో పాల్గొనాలి అనుకున్న వారు ముందుగా వికీ లవ్స్ మోన్యుమెంట్స్ 2001 ఇన్ ఇండియా అని సెర్చ్ చేసి మొదటిగా వచ్చిన వెబ్ సైట్ ని ఓపెన్ చేసినట్లయితే అక్కడ మీకు కొన్ని ఆప్షన్లు అనేవి కనిపిస్తాయి.

Video Advertisement

మీకు ముందుగానే wikimedia commons లో ఎకౌంటు ఉన్నట్లయితే దాని ద్వారా లాగిన్ అవ్వొచ్చు లేదు అంటే క్రియేట్ అకౌంట్ చేసుకొనవచ్చు దీనికి మీ దగ్గర మీరు ఉపయోగించే ఈమెయిల్ ఉన్నట్లయితే సరిపోతుంది ఇమెయిల్ తో మీరు వికీమీడియా కామన్స్ లో ఎకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీ దగ్గరలో ఉన్న సంస్కృతి, నాగరికత కు సంబంధించిన ప్రదేశాలలో మీరు తీసిన ప్రత్యేక చిత్రాలను అప్లోడ్ చేయవచ్చు.ఒకవేళ మీకు దగ్గరలో ఎలాంటి ప్రదేశాలు ఉన్నాయో మీకు తెలియనట్లైతే, అక్కడే ఉన్నా ఫైండ్ మోన్యుమెంట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్న నాగరికతకు సంబంధించిన ప్రదేశాలు మీకు వికీ చూపించడం జరుగుతుంది.

అక్కడికి వెళ్లి మీరు పిక్చర్స్ తీసుకోవచ్చు, చిత్రాన్ని మీరు అప్లోడ్ చేసిన తర్వాత దానిని మీరు ఏ విధంగా తీయడం జరిగింది దాని యొక్క చరిత్ర మొదలగు మీకు తెలిసిన వివరాలు అన్నీ డెస్క్రిప్షన్ రూపంలో అక్కడ పొందుపరచాల్సి ఉంటుంది మీరు వీటిని పంపించిన తర్వాత మీ అడ్రస్ ను కూడా జత చేయాల్సి ఉంటుంది. కాంపిటీషన్ డేట్ ( సెప్టెంబర్ 1 టు 30 ) అనేది ముగిసిన తర్వాత వచ్చిన చిత్రాల నుంచి పది మంది విజేతలను ఎంపిక చేయడం జరుగుతుంది. మొదటి విజేతకు 12 వేల రూపాయల గిఫ్ట్ వొచర్ + ఒక టీ షర్ట్ + ఒక స్వాగ్ కిట్ + సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది అంతే కాకుండా మిగిలిన విజేతలకు కూడా వివిధ స్థాయిల్లో బహుమతులు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా గెలిచినా పదిమంది చిత్రాలను ఇంటర్నేషనల్ కాంపిటీషన్ కి కూడా పంపించడం జరుగుతుంది గెలిచినవారికి ఇంటర్నేషనల్ స్థాయిలో బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వివరాలు https://commons.m.wikimedia.org/wiki/Commons:Wiki_Loves_Monuments_2021_in_India ద్వారా తెలుసుకోవచ్చు.

Website Link >> Click Here


End of Article

You may also like