Big Boss: ఆమె రానని చెప్పినా.. తప్పని ఎదురుచూపులు..? ఇంతకీ వస్తుందా..?

Big Boss: ఆమె రానని చెప్పినా.. తప్పని ఎదురుచూపులు..? ఇంతకీ వస్తుందా..?

by Anudeep

Ads

బిగ్ బాస్ రియాలిటీ షో మొదలైనప్పటి నుంచి సోషల్ మీడియా లో బిగ్ బాస్ కి సంబంధించిన సందడి ఎక్కువగానే ఉంటోంది. ఆ హౌస్ లో జరుగుతున్న ముచ్చట్ల గురించి కొందరు ట్రోల్స్ చేస్తుంటే.. మరికొందరు సస్పెన్స్ రేకెత్తించేలా కథనాలను అల్లేస్తున్నారు. ఇది ఇలా ఉంటె.. బిగ్ బాస్ హౌస్ లోకి విష్ణు ప్రియ కూడా ఎంట్రీ ఇస్తుందని గతం లో కధనాలు వచ్చాయి.

Video Advertisement

vishnu priya

తాజాగా.. ఈ వార్తలు మరింత జోరందుకుంటున్నాయి. బిగ్ బాస్ షో ప్రారంభం రోజునే మొత్తం 19 మంది సెలెబ్రిటీలు ఎంట్రీ ఇచ్చేసారు. దీనితో వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండే అవకాశం లేదు అని భావించేవారు కూడా ఉన్నారు. ఇది ఇలా ఉంటె.. ఆ బిగ్ బాస్ హౌస్ లో ఏదైనా జరిగే అవకాశం ఉండొచ్చు కాబట్టి వైల్డ్ కార్డు ఎంట్రీ కూడా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ క్రమం లో విష్ణు ప్రియ వైల్డ్ కార్డు ఎంట్రీ తో ఎంటర్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మరో వైపు ఆమె నేను బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళను అంటూ క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ ఈ కధనాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఈ క్రమం లో ఆమె వచ్చే అవకాశం ఉందేమో అని బిగ్ బాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.


End of Article

You may also like