Ads
బ్రిటన్ రాకుమారుడు విలియం మరియు ఆయన భార్య కేట్ మిడెల్టన్ ల జంట కు ప్రత్యేకంగా ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. వీరు రాజకుటుంబం నుంచి బయటకు వచ్చినా తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా.. వీరిద్దరూ చపాతీలు, మరియు అందులోకి కూర మండుతున్న ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. సిక్కు మహిళలు సాయం చేస్తుండగా.. వారు ఈ పనిని పూర్తి చేసారు.
Video Advertisement
ఎడిన్బర్గ్ లోని పేదల కోసం ఆహరం అందించడానికి వీరు చపాతీలను, కూరను స్వయం గా వండారు. సిక్కు సంజోగ్ సమూహం ఈ పనిని మొదలు పెట్టగ.. వారితో పాటు విలియం దంపతులు కూడా పాలుపంచుకున్నారు. ఎడిన్బర్గ్ లోని క్వీన్ నివాసానికి దగ్గరలోని కిచెన్ లోనే వీరు ఈ వంట చేసారు. ఈ సమయం లో తీసిన ఫోటోలను “ద డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ కేంబ్రిడ్స్” తమ ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. దీనితో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.
Cooking up a storm in the café kitchen at the Palace of Holyroodhouse with Sikh Sanjog, where The Duke and Duchess prepared meals to be distributed to vulnerable families across the Edinburgh community ? pic.twitter.com/pFkoor8yQq
— The Duke and Duchess of Cambridge (@KensingtonRoyal) May 24, 2021
End of Article