ఎంత మంచి భార్య అయినా.. ఈ 4 విషయాలని భర్తకి ఎప్పుడూ చెప్పదు.. అవేంటంటే..?

ఎంత మంచి భార్య అయినా.. ఈ 4 విషయాలని భర్తకి ఎప్పుడూ చెప్పదు.. అవేంటంటే..?

by Mohana Priya

Ads

భార్య భర్తల మధ్య దాపరికాలు ఏమీ ఉండకూడదు అని చెబుతుంటారు. కానీ, చాల విషయాల్లో భర్త భార్య దగ్గర దాపరికాన్ని మైంటైన్ చేస్తారు. భార్యని బాధ పెట్టకూడదనో.. లేక భార్య గాబరా చెందుతుందనో భావించి కొన్ని విషయాలను దాచేస్తూ ఉంటాడు. మరో వైపు కొందరు భార్యలు కూడా అంతే. సంసారంలో మోసపూరితంగా వ్యవహరించే భార్య భర్తల సంగతి పక్కన పెడితే.. కొందరు మంచి భార్యలు కూడా కొన్ని విషయాలను తమ భర్తల వద్ద దాచిపెడతారు.

Video Advertisement

 

భారతీయ సనాతన వ్యవస్థలో భర్త మాటని గౌరవించి నడుచుకునే స్త్రీలు చాలా మందే ఉన్నారు. అలాగే.. భార్యని గౌరవించి.. ఆమె అభిప్రాయాలకు విలువిచ్చే భర్తలు కూడా తక్కువేమి కాదు. అయినప్పటికి.. ఆ భర్తని బాధపెట్టే విషయాలని కానీ, అతని మనశ్శాంతిని దూరం చేసే విషయాలను కానీ చెప్పడానికి ఏ భార్యా ఇష్టపడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

wife 1

# 1. విషాదం:
భార్యలు ఏ విషయం గురించైనా ఆందోళన చెందుతున్నా.. బాధ పడుతున్నా ఆ విషయం గురించి భర్తకి చెప్పడానికి ఇష్టపడరు. వారిలో వారే ఆ బాధని అణచుకుంటారు తప్ప భర్తకి చెప్పి ఇబ్బంది పెట్టాలని అనుకోరు.

wife 2

# 2. అనారోగ్యం:
భార్యల విషయంలో ఎక్కువగా బాధ పెట్టేది అనారోగ్యం. చాలా వరకు ఏ భార్యా తనకు ఉన్న అనారోగ్య ఇబ్బంది గురించి చెప్పాలని అనుకోదు. ఓపిక తెచ్చుకుని తమ పనులు తాము చేసుకోవాలనే అనుకుంటారు. పరిస్థితి చేయి దాటిపోతోందని అనిపిస్తే ఇంట్లో ఇతర కుటుంబ సభ్యులకు తెలియ చేస్తారు.

wife 3

# 3. ప్రేమ:
భార్యలకు కూడా తమ భర్తపై అమితమైన ప్రేమ ఉంటుంది. అయితే.. ఈ విషయాన్నీ రుజువు చేసుకోవడానికి.. భర్తపై తమ ప్రేమని పదే పదే ప్రకటిస్తూ ఉండే స్త్రీలు తక్కువే. భార్య అంతరంగాన్ని గ్రహించి పురుషుడు నడుచుకోవాల్సి ఉంటుంది.

money

# 4. ధనం:
కొందరు స్త్రీలు భర్తకి తెలియకుండా రహస్యంగా ధనం దాస్తూ ఉంటారు. ఎక్కువ మొత్తంలో కాకపోయినా.. అవసరానికి ఆదుకునేలా ఉండే విధంగా ఎంతో కొంత దాచుకుంటూ ఉంటారు. వీటి గురించి కూడా భర్తకి చెప్పరు. వాటిని ఖర్చు చేయకుండా దాచి ఉంచి.. అవసరం వచ్చిన సమయంలో కుటుంబాన్ని ఆదుకుంటారు.


End of Article

You may also like