కోటీశ్వరుల కుటుంబంలో పుట్టి పెరిగిన ఒక అమ్మాయి  ఒక సాధారణ యువకుడిని ప్రేమించి, అతడే తన సర్వస్వం అని భావించి, ఆమె తల్లిదండ్రులు వారి ప్రేమను నిరాకరించడంతో వారసత్వంగా ఆ అమ్మాయికి వచ్చిన రెండు వేల కోట్ల ఆస్తిని వదులుకుని, ప్రేమించినవాడితో పెళ్లికి సిద్ధమైంది.

Video Advertisement

ఇది సినిమా స్టోరీ కాదు. మలేసియాలో జరిగిన వాస్తవ సంఘటన. మలేసియా బిజినెస్‌ టైకూన్‌ కూతురి ప్రేమ కథ ఇది.  ప్రేమించినవాడి కోసం అన్నిటినీ వదిలి, ఇంట్లో నుంచి బయటకు వచ్చి, నచ్చినవిధంగా తన జీవితాన్ని లవర్ తో కొనసాగిస్తోంది. ఆ  వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రముఖ మలేసియా బిజినెస్‌ టైకూన్‌ ఖూ కే పెంగ్‌ మరియు మాజీ మిస్‌ మలేసియా అయిన పాలైన్‌ ఛాయ్‌ ల కూతురు ఏంజెలినా ఫ్రాన్సిస్‌. ఆమె ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చదువుకుంది. ఆ సమయంలోనే ఆమె జెడియా అనే ఫ్రెండ్ ని  ప్రేమించింది. వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తరువాత ఏంజెలినా తన తల్లిదండ్రులకు ప్రేమ విషయాన్ని తెలిపింది. అయితే ఆమె తల్లిదండ్రులు వారి పెళ్ళికి నిరాకరించారు.
ఆర్థికపరంగా ఇద్దరి కుటుంబాల్లో చాలా తేడా ఉండడంతో వారు ప్రేమించిన వాడికి దూరం కావడమో లేదా కుటుంబ వారసత్వాన్ని వదులుకోవడమో రెండిటింటిలో ఏదో ఒకటి నిర్ణయించుకోమని ఆదేశించారు. అయితే ఏంజెలినా ప్రేమించినవాడితో జీవితం పంచుకోవడం కోసం ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి, 2008లో పెళ్లి చేసుకొని తాను కోరుకున్నవాడితో కొత్త లైఫ్ ను మొదలుపెట్టింది. ఈ క్రమంలో మేకు వారసత్వంగా రావలసిన దాదాపు రెండు వేల కోట్ల ఆస్తినీ వదిలేసింది.
పెళ్లి తరువాత ఇద్దరు కూడా కూడా ఇరు కుటుంబాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కానీ, చాలారోజులు తరువాత ఏంజెలినా తన పేరెంట్స్ ను కలవాల్సి వచ్చింది. దానికి కారణం ఏంజెలినా తల్లిదండ్రులు డైవర్స్ తీసుకున్నారు. కోర్టులో వాంగ్మూలం ఇవ్వడానికి ఆమె కోర్టుకు వెళ్లింది. తన తల్లి పాలైన్‌ ఛాయ్‌ గురించి గొప్పగా చెప్పిన ఆమె తండ్రిపై  విమర్శలు చేసింది. ప్రస్తుతం ఏంజెలినా లవ్ స్టోరీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Also Read: లవర్ కి ఈ అబ్బాయి పెట్టిన కండిషన్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!