ప్రతి ఒక్కరికి తమ ప్రేయసి లేదా భార్యగా ఎలాంటి వ్యక్తి కావాలి అనే విషయం పై కొన్ని స్పెసిఫికేషన్‌లు ఉంటాయి. ఎక్కువమంది తమ ప్రమాణాలకు దాదాపుగా సరిపోయే వారినే తమ పార్టనర్ గా ఎంచుకుంటూ ఉంటారు. అయితే  కొందరు వ్యక్తులు తాము అనుకున్న స్పెసిఫికేషన్‌ల విషయంలో చాలా కఠినంగా ఉంటారు.

Video Advertisement

ఒక వ్యక్తి రెడ్డిట్‌ లో తనకు గర్ల్ ఫ్రెండ్ కు పెట్టిన పదిహేను షరతులు  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతను పెట్టిన డిమాండ్లు చూసిన నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. ప్రేమ అనేది నమ్మకం, ఎదుటి వ్యక్తి ఇచ్చే గౌరవం, కేరింగ్ లాంటి వాటితో నిలబడుతుంది. కానీ కండిషన్లు, డిమాండ్లతో ఏ బంధం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. అయితే ఒక వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్ పాటించాల్సిన 15 రూల్స్ చెప్పాడట. దానికోసం ఓ లిస్ట్ కూడా ఇచ్చాడట. ఆమె ఆ లిస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానిని చూసినవారు షాక్ అవుతున్నారు. నెటిజెన్లు అతని పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ట్రోల్ చేస్తున్నారు.

 • గర్ల్ ఫ్రెండ్ ఎత్తు 5’6 కాని, అంతకన్నా తక్కువ ఉండాలి.
 • ఆమె కళ్లు నీలం రంగులో లేదా ఆకుపచ్చగా ఉండాలి
 • 18 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి.
 • మగవారు స్నేహితులు ఉండకూడదు
 • టాటూలు ఉండకూడదు.
 • బయట తినడం లేదా తాగడం వంటివి  చేయకూడదు
 • బిగుతుగా ఉండే  వస్త్రాలు ధరించకూడదు.
 • ఐదుగురు మగ సంతానాన్ని ఇవ్వాలి
 • ధూమపానం చేయకూడదు, ఆల్కహాల్ తీసుకోకూడదు.
 • తండ్రితో మంచి సంబంధాలు కలిగి ఉండాలి.
 • ఏ విషయంలోనూ, ఎప్పుడూ వాదించకూదు
 • చదువు లేదా ఉద్యోగం పట్ల ఇంట్రెస్ట్ ఉండాలి.
 • సెలబ్రిటీ క్రష్‌లు ఉండకూడదు.
 • జిమ్ కు వెళ్లకూడదు
 • కచేరీలు లేదా ఉత్సవాలకు వెళ్లకూడదు.
 • సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకోకూడదు.
 • వెళ్లినా రాత్రి 9 గంటల కల్లా తిరిగి రావాలి
 • తాను చెప్పిన దుస్తులు ధరించాలి.
 • ఎలాంటి పార్టీలకు వెళ్లకూడదుAlso Read: లగ్జరీ ఇల్లు అమ్మేసిన ముకేశ్ అంబానీ.. ఎన్ని కోట్లు వచ్చాయంటే..?