భర్త శవం కూడా అదే విమానంలో ఉందని తెలియని మూడు నెలల గర్భిణి…చివరికి?

భర్త శవం కూడా అదే విమానంలో ఉందని తెలియని మూడు నెలల గర్భిణి…చివరికి?

by Anudeep

Ads

విధి ఎప్పుడు ఎవరితో ఎలా ఆడుకుంటుందో ? ఎవరికి అంతుబట్టదు. ఈ క్షణానికి సంతోషంగా గడిపిన వాళ్లు మరుక్షణం బాగుంటారని చెప్పలేం. అంతా  విధిలీల . వివాహం జరిగి ఆరునెలలు, మరో ఆరునెలల్లో పండంటి బిడ్డకి జన్మనివ్వబోతూ , భవిష్యత్  కోసం కలలు కంటున్న తరుణంలో భర్త చనిపోయాడు. భర్త శవం తనతో పాటే ఒకే విమానంలో ప్రయాణించినా, తర్వాత ఆ విషయం తెలిసి గుండెలు పగిలేలా ఏడ్చింది. కేరళలో చోటు చేసుకున్న విషాద ఘటన వివరాలు.

Video Advertisement

ముఫ్పై ఏళ్ల మొహమ్మద్ సహీర్ ది  కేరళలలోని కన్నూరుకి దగ్గరలోని చుజాలి గ్రామం. ఆరు నెలల క్రితం షిఫానాతో వివాహం జరిగింది. వివాహం తర్వాత భార్యను తీసుకుని ఒమన్ కి వెళ్లిపోయాడు సహీర్. భర్తతో కలిసి మస్కట్ వచ్చిన షిఫానా సంతోషంగా గడుపుతోంది. వారి దాంపత్య బంధానికి గుర్తుగా తనలో మరో ప్రాణి జీవం పోసుకుంది. దీంతో అటు సహీర్ , ఇటు షిపానా కుటుంబ సభ్యులు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఒక రోజు స్నేహితులతో  ఫుట్ బాల్ ఆడడానికి వెళ్లిన సహీర్, ఆట ఆడుతూ గ్రౌండ్లో కుప్పకూలిపోయాడు. దీంతో ఫ్రెండ్స్ సహీర్ ను వెంటనే నిజ్వాలోని బదర్ అల్ సమా హాస్పిటల్ కి తీస్కెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు తను చనిపోయాడని, గుండెనొప్పి వచ్చిందని చెప్పారు. వారికి కడుపుతో ఉన్న షిపానాకు ఈ విషయం ఎలా చెప్పలో అర్దం కాలేదు.

దాంతో నేరుగా విషయం చెప్పకుండా సహీర్ కి కరోనా లక్షణాలు ఉన్నాయని, హాస్పటల్ ఐసోలేషన్ వార్డులో ఉన్నారని చెప్పారు. తనని చూస్తానంటే, నువ్ ప్రెగ్నెంట్  వి కాబట్టి నిన్ను లోపలకి అనుమతించరని తనను భారత్ కి వెళ్లేందుకు ఒప్పించారు. భర్త ఆరోగ్యం బాగాలేదని తెలిసిన షిఫానా భారంగానే వెనుదిరిగింది.

మస్కట్ నుండి కోజికోడ్ వచ్చే ఎయిరిండియా విమానంలో షిఫానా ఇండియాకి బయల్దేరగా, అదే విమానంలో సహీర్ మృతదేహం ఉన్ శవపేటికను తీసుకొచ్చారు. కన్నూరు చేరుకున్నాక అసలు విషయం షిఫానా కి చెప్పారు. నిజం తెలుసుకున్న షిపానా భోరున ఏడ్చింది.  పండంటి బిడ్డతో ఇండియాకి తిరిగొస్తారనుకుని నిర్జీవంగా వచ్చిన సహీర్ ని చూసి ఇరు వైపుల కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు.


End of Article

You may also like