మహిళపై చేరి పడగా విప్పిన పాము…మల్లికార్జునా అని ప్రార్దించేసరికి ఏమైందంటే.?

మహిళపై చేరి పడగా విప్పిన పాము…మల్లికార్జునా అని ప్రార్దించేసరికి ఏమైందంటే.?

by Anudeep

Ads

పాము అంటేనే చాలామంది భయపడతారు. భక్తిగా పూజలు చేసినప్పటికీ సడన్ గా పాము కనిపిస్తే గుండెలు హడలెత్తుతాయి. అలాంటిది నేరుగా పాము పొట్ట మీదే కూర్చొని బుసలు కొడితే….. అమ్మో ఊహించడానికి భయంగా ఉంది కదా…అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక ఆమె పొట్ట మీద కూర్చొని బుసలు కొడుతున్న పాము వీడియో బాగా వైరల్ అయ్యింది.

Video Advertisement

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియోలో ఒక నాగుపాము, చెట్టు కింద మంచం మీద పడుకొని ఉన్న మహిళపై కూర్చున్నట్లు చూపిస్తుంది. ఆ పాము నెమ్మదిగా మంచం మీద పడుకున్న ఆ స్త్రీ వీపు మీద నుంచి పైకి ఎక్కి ఆమె పోట్టపై కూర్చొని పడగవిప్పి బుసలు కొడుతూ ఉండడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.

“నిజంగానే ఆ మహిళ చాలా ధైర్యంగా ప్రవర్తించింది. అఫ్కోర్స్ భయంతో బిగుసుకుపోయినా ఎటువంటి శబ్దం చేసి ఆ పామును బెదిరించకుండా …. ఎంతో ధైర్యంతో కదలకుండా ఉండడం మెచ్చుకోదగ్గ విషయం”అని ట్విట్టర్లో ఆ వీడియో చూసిన ఎందరో ఆ మహిళ ధైర్యాన్ని మరియు సమయస్ఫూర్తిని మెచ్చుకున్నారు.

ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది కర్ణాటక రాష్ట్రం లోని కలబురగి జిల్లా లోని అఫ్జల్ పుర్ తాలూకా మల్లాబాద్ అనే గ్రామంలో. ఆ గ్రామంలో నివసిస్తున్న భాగమ్మ అనే మహిళ, ఒకరోజు మధ్యాహ్నం తన ఇంటి పెరట్లో చెట్టు కింద మంచం వేసుకొని హాయిగా చల్లగాలికి పడుకుంది. అదే సమయంలో ఎప్పుడు వచ్చిందో కానీ ఓ నాగుపాము పైకి చేరి పడగ విప్పి బుసలు కొట్టడం మొదలు పెట్టింది.

ఆ పామును చూసి భాగమ్మ భయం కలిగిన ఎంతో తెలివిగా కదలకుండా కళ్ళు మూసుకొని జై మల్లికార్జున అంటూ శివుడి నామం జపించుకుంటూ కూర్చుంది. కాసేపటికి ఆ పాము ఆమెను ఏమీ చేయకుండా మెల్లిగా కిందకు దిగి వెళ్లి పోయింది. ప్రస్తుతం నెట్ లో వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసి కొందరు ఇది కేవలం శివయ్య లీల అని కామెంట్ చేస్తే మరికొందరు అది కేవలం

భాగమ్మ సమయస్ఫూర్తి మరియు అదృష్టమని భావిస్తున్నారు.
ఏది ఏమైనప్పటికీ ధైర్యసాహసాలతో ఎటువంటి విపత్తునైనా ఎదురుకోవచ్చు అని అప్పుడప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసి మనం నేర్చుకోవచ్చు.

watch video:


End of Article

You may also like