పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ కి పెళ్లి మండపంలోనే బాండ్ రాసిచ్చిన వధువు…ఇలాంటి భార్య దొరకడం నిజంగా అదృష్టమే.!

పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ కి పెళ్లి మండపంలోనే బాండ్ రాసిచ్చిన వధువు…ఇలాంటి భార్య దొరకడం నిజంగా అదృష్టమే.!

by Mohana Priya

Ads

వందేళ్ల జీవితానికి పెళ్లి అనేది ముఖ్యమైన మజిలీ. కానీ ముందుగా తమ ఇష్టాలు, కోరికలు, కలల గురించి చర్చించుకోకపోతే మాత్రం తర్వాత బాధ పడాలి. అలాగే తమ స్నేహితుడు పెళ్లి తర్వాత ఎక్కడ క్రికెట్ కు దూరమవుతాడోనని అతడి స్నేహితులు వధువు ముందుకు ఒక వింత ప్రతిపాదన తెచ్చారు.
తమ మిత్రుడు క్రికెట్ ఆడేందుకు కొత్త భార్య ఎక్కడ అభ్యంతరం చెబుతుందేమోనని ఆమెతో ఏకంగా బాండ్ పేపర్‌పైనే రాయించుకుని సంతకం చేయించుకున్నారు అతడి స్నేహితులు. విస్తుగొలిపే ఈ ఘటన తమిళనాడులోని మదురైలో చోటుచేసుకుంది.

Video Advertisement


హరిప్రసాద్‌ అనే వ్యక్తికి మదురైకి చెందిన పూజ అనే యువతితో తాజాగా వివాహం జరిగింది. హరిప్రసాద్‌ తేనీలోని ఓ ప్రైవేటు కాలేజీలో టీచర్‌గా పనిచేస్తున్నారు. అలాగే ‘సూపర్‌స్టార్‌’ క్రికెట్ క్లబ్‌కు కెప్టెన్‌గా కూడా వ్యహరిస్తున్నారు. అయితే వివాహం తర్వాత తమ స్నేహితుడు ఎక్కడ క్రికెట్‌కు దూరమవుతారో, ఎక్కడ తన భార్య క్రికెట్‌కు అనుమతించదో అని అనుమానం వ్యక్తం చేసిన హరిప్రసాద్‌ స్నేహితులు.. వివాహ వేదికపైనే పెళ్లి కూతురుకు ఓ షరతు విధించారు.

వందేళ్ల జీవితానికి పెళ్లి అనేది ముఖ్యమైన మజిలీ. కానీ ముందుగా తమ ఇష్టాలు, కోరికలు, కలల గురించి చర్చించుకోకపోతే మాత్రం తర్వాత బాధ పడాలి. అలాగే తమ స్నేహితుడు పెళ్లి తర్వాత ఎక్కడ క్రికెట్ కు దూరమవుతాడోనని అతడి స్నేహితులు వధువు ముందుకు ఒక వింత ప్రతిపాదన తెచ్చారు. తమ మిత్రుడు క్రికెట్ ఆడేందుకు కొత్త భార్య ఎక్కడ అభ్యంతరం చెబుతుందేమోనని ఆమెతో ఏకంగా బాండ్ పేపర్‌పైనే రాయించుకుని సంతకం చేయించుకున్నారు అతడి స్నేహితులు. విస్తుగొలిపే ఈ ఘటన తమిళనాడులోని మదురైలో చోటుచేసుకుంది. హరిప్రసాద్‌ అనే వ్యక్తికి మదురైకి చెందిన పూజ అనే యువతితో తాజాగా వివాహం జరిగింది. హరిప్రసాద్‌ తేనీలోని ఓ ప్రైవేటు కాలేజీలో టీచర్‌గా పనిచేస్తున్నారు. అలాగే ‘సూపర్‌స్టార్‌’ క్రికెట్ క్లబ్‌కు కెప్టెన్‌గా కూడా వ్యహరిస్తున్నారు. అయితే వివాహం తర్వాత తమ స్నేహితుడు ఎక్కడ క్రికెట్‌కు దూరమవుతారో, ఎక్కడ తన భార్య క్రికెట్‌కు అనుమతించదో అని అనుమానం వ్యక్తం చేసిన హరిప్రసాద్‌ స్నేహితులు.. వివాహ వేదికపైనే పెళ్లి కూతురుకు ఓ షరతు విధించారు. వారంతాలు అంటే శని, ఆదివారాల్లో హరిప్రసాద్‌ను క్రికెట్‌ ఆడేందుకు అనుమతించాలని పూజను కోరారు. కేవలం మాట మాత్రమే కాకుండా బాండు పేపరుపై రాసి ఇవ్వాలని సూచించారు. వాళ్లు తనను ఆటపట్టిస్తున్నారేమో అని పూజ భావించింది. కానీ, ఏకంగా రూ.20 బాండు పేపరు తీసుకొచ్చి సంతకం చేయమని కోరడంతో షాకయ్యింది. క్రికెట్‌ విషయంలో స్నేహితులకు ఉన్న పట్టుదలను చూసి ఆమె సంతకం చేయక తప్పలేదు. ‘‘పూజ అను నేను.. నా భర్త, సూపర్‌స్టార్ టీమ్ క్రికెట్ క్లబ్ జట్టు కెప్టెన్ హరిప్రసాద్‌ను శని, ఆదివారాలు క్రికెట్ ఆడేందుకు అనుమతిస్తాను’’ అని బాండ్ పేపర్‌పై సంతకం చేసింది. ఈ సన్నివేశం పెళ్లి మండపంలో నవ్వులు పూయించగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లికి విచ్చేసిన అతిథులు ఈ ఘటన చూసి ముందు షాక్‌ అయినా తర్వాత నవ్వుకున్నారు. హరిప్రసాద్ స్నేహితుడు రామ్‌కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఉసిలై సూపర్ స్టార్ క్రికెట్ క్లబ్‌ టీమ్ సభ్యుల్లో చాలా మంది పెళ్లి తర్వాత ఆటను వదిలేశారు.. కొద్ది మంది మాత్రమే తమ భార్యల నుంచి అనుమతి తీసుకుని ఆడుతున్నారు.. మా కెప్టెన్ విషయంలో అలా జరగకూడదని ఆయన భార్యతో సంతకం చేయించుకున్నాం’’ అని తెలిపారు.
వారాంతాలు అంటే శని, ఆదివారాల్లో హరిప్రసాద్‌ను క్రికెట్‌ ఆడేందుకు అనుమతించాలని పూజను కోరారు. కేవలం మాట మాత్రమే కాకుండా బాండు పేపరుపై రాసి ఇవ్వాలని సూచించారు. వాళ్లు తనను ఆటపట్టిస్తున్నారేమో అని పూజ భావించింది. కానీ, ఏకంగా రూ.20 బాండు పేపరు తీసుకొచ్చి సంతకం చేయమని కోరడంతో షాకయ్యింది. క్రికెట్‌ విషయంలో స్నేహితులకు ఉన్న పట్టుదలను చూసి ఆమె సంతకం చేయక తప్పలేదు.
‘‘పూజ అను నేను.. నా భర్త, సూపర్‌స్టార్ టీమ్ క్రికెట్ క్లబ్ జట్టు కెప్టెన్ హరిప్రసాద్‌ను శని, ఆదివారాలు క్రికెట్ ఆడేందుకు అనుమతిస్తాను’’ అని బాండ్ పేపర్‌పై సంతకం చేసింది. ఈ సన్నివేశం పెళ్లి మండపంలో నవ్వులు పూయించగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లికి విచ్చేసిన అతిథులు ఈ ఘటన చూసి ముందు షాక్‌ అయినా తర్వాత నవ్వుకున్నారు.

bride signs on bond paper to let her husband to play cricket
హరిప్రసాద్ స్నేహితుడు రామ్‌కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఉసిలై సూపర్ స్టార్ క్రికెట్ క్లబ్‌ టీమ్ సభ్యుల్లో చాలా మంది పెళ్లి తర్వాత ఆటను వదిలేశారు.. కొద్ది మంది మాత్రమే తమ భార్యల నుంచి అనుమతి తీసుకుని ఆడుతున్నారు.. మా కెప్టెన్ విషయంలో అలా జరగకూడదని ఆయన భార్యతో సంతకం చేయించుకున్నాం’’ అని తెలిపారు.


End of Article

You may also like