వైకల్యాన్ని సైతం లెక్కచేయకుండా కొడుకు కోసం 1200కి.మి ప్రయాణించిన అమ్మ…దారిలో ఇంకెన్నో కష్టాలు.!

వైకల్యాన్ని సైతం లెక్కచేయకుండా కొడుకు కోసం 1200కి.మి ప్రయాణించిన అమ్మ…దారిలో ఇంకెన్నో కష్టాలు.!

by Anudeep

Ads

మొన్న రజియా ,నేడు సోనూ.. లాక్ డౌన్లో ఎక్కడో చిక్కుకుపోయిన పిల్లల గురించి తల్లడిల్లి ఇక వేరే మార్గం లేక బయల్దేరి వెళ్లి కొడుకులను  తామే స్వయంగా ఇళ్లకు తీసుకొచ్చుకున్న ఘటనలు అందరి మనసులను గెలుచుకుంటున్నాయి.. అమ్మంటే అంతే.. కడుపున పుట్టిన బిడ్డల శ్రేయస్సు కోసం ఎంతటి సాహసానికైనా పూనుకుంటారని ఎన్నో ఉదాహరణలు చూసాం..చూస్తున్నాం.

Video Advertisement

మహారాష్ట్రలోని పుణె జిల్లా పిప్రీ చించావడ్ ప్రాంతానికి చెందిన సోనూ ఖందారే కొడుకు ప్రతీక్ లాక్ డౌన్ కారణంగా అమరావతిలో చిక్కుకుపోయాడు.. కొడుకు ఇంటికి చేరడానికి ఎలాంటి రవాణా సౌకర్యాలు లేకపోవడంతో  సోనూ తన ద్విచక్ర వాహనంపై అమరావతికి బయల్దేరింది. బిడ్డ కోసం తన వైకల్యాన్ని సైతం లెక్కచేయకుండా ఈ సాహసానికి ఒడిగట్టింది.1200 కి.మీ.  దూరం స్కూటిపై వెళ్లి తన కొడుకుని ఎట్టకేలకు చేరుకుంది.

కొడుకు కోసం బయల్దేరడానికి ముందే ప్రయాణంలో వచ్చే ఇబ్బందులను అంచనా వేసింది సోనూ, 1200కి.మీ దూరం అంటే మామూలు విషయం కాదు, అయినప్పటికి కొడుకుపై తన ప్రేమ ముందు ఆ ఇబ్బందులు నిలబడలేకపోయాయి. రాత్రిపూట పెట్రోల్ బంకుల్లో పడుకోవడం, తెల్లవారు జామున బయల్దేరి ప్రయాణం చేయడం, ఈ క్రమంలో నాలుగు సార్లు బైక్ పంక్చర్ అయినప్పటికి నిరాశపడలేదు..

సోనూ గురించి తెలిసిన నెటిజన్లు తనని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు,పోయిన నెల భోధన్ కి చెందిన రజియా అనే మహిళ కొడుకు కోసం  1400కిమి ప్రయాణించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కి ముందు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని తెలియక ఊర్లకు వెళ్లిన చాలామంది పిల్లలు , వెళ్లిన చోటే ఇరుక్కుపోయిన సంఘటనలు తెలిసినవే..ఉన్న చోట క్షేమంగా ఉంటే సరేసరి లేదంటే అక్కడ పిల్లలకి, ఇక్కడ కన్నతల్లికి నరకంతో సమానం..ఈ ఘటనలు తెలిసిన వారు తల్లి ప్రేమను కొనియాడుతున్నారు.


End of Article

You may also like