డబ్బులివ్వకుండా తరిమేశారు….తిండి లేకుండా 100కిలోమీటర్లు నడిచిన 8నెలల గర్భిణీ

డబ్బులివ్వకుండా తరిమేశారు….తిండి లేకుండా 100కిలోమీటర్లు నడిచిన 8నెలల గర్భిణీ

by Anudeep

Ads

ఈ దేశంలో ఏం జరిగినా ,ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మొదటి బాదితుడు పేదవాడే. మొన్న డీ మానిటైజేషన్ నాడు అంతే, నేడు కరోనా లాక్ డౌన్ ప్రకటించినప్పుడు ఇంతే . కరోనాని కట్టడి చేయాలంటే లాక్ డౌన్ ఒక్కటే మార్గం , అవును వేలాది ప్రాణాలు పోకుండా ఉండాలంటే ఎక్కడి వాళ్లక్కడ ఆగిపోవాల్సిందే . కాని కూడు, గుడ్డ,గూడు కోసం పొట్ట చేతపట్టుకుని వచ్చిన పేదవారి పరిస్థితి ఏంటి ??

Video Advertisement

ఇరవై ఒక్క రోజులు లాక్ డౌన్ ప్రకటించగానే ఎక్కడి వాళ్లక్కడే ఉన్నారు . రవాణా వ్యవస్థ స్తంబించిపోయింది. ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. వైరస్ ఎటు నుండి వస్తుందో అన్నట్టుగా అన్ని పనులు మానుకుని అందరూ ఇళ్లల్లో కూర్చున్నారు . కాని రోజు కూలిలు, పని చేసుకునే వారు, పని చేస్కోవడానికి పట్నం వచ్చి ఇప్పుడు పని లేక ఎన్ని రోజులు ఈ పరిస్థితి ఉంటుందో తెలియక ,ఇక్కడ మాయదారి రోగం వచ్చి పోయేకంటే కనీసం ఊరికెళితే మనోళ్లు పక్కనుంటారనే ధైర్యంతో రవాణా వసతి లేకపోయినా కాలినడకన సొంత ఊర్లకి బయల్దేరారు.

ఎన్నెన్ని కన్నీటి కథలసలు ..ఉత్తర ప్రదేశ్లోని షహ్రాన్ పూర్ లో ఒక కంపెనిలో పనిచేసేవాడు  వకీల్. లాక్ డౌన్ అనౌన్స్ చేయగానే  పని లేదు,రూం కూడా ఖాళీ చేయాలని ఓనర్ చెప్పడంతో భార్య యాస్మిన్ తోకలిసి సొంతూరికి బయల్దేరాడు.భార్య ఒట్టి మనిషి కూడా కాదు నిండు గర్బిణి. మరోవైపు  పరిస్థితి బాగోలేదని ఖర్చులకి పదో పరకో ఇచ్చి పంపాల్సింది పోయి , చేసిన పనికి జీతం కూడా ఇవ్వకుండా పని నుండి వెళ్లగొట్టాడు ఆ యజమాని. చేతిలో చిల్లిగవ్వ లేదు, ఊరు చూస్తే 190 కిలీమీటర్లు, కనీసం తిండి తినడానికి ఎక్కడా హోటల్స్ కూడా లేవు.

రెండు రోజుల పాటు తఆహారం లేకుండానే వంద కిలోమీటర్ల వరకు నడిచి మీరట్ లోని సోహ్రాబ్ గేట్ బస్టాండ్ వరకు చేరుకునారు. అక్కడి నుంచి మరో వంద కిలోమీటర్లు . నడవడానికి తనకే కష్టంగా ఉంది మరి యాస్మిన్ పరిస్థితి . నడవలేక నీరసంతో పడిపోయింది. స్థానికులు వాకబు చేయగా అసలు విషయం తెలుసుకుని కళ్లనీళ్ల పెట్టుకున్నారు. పోలీసులుకు విషయం తెలియచేశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు కూడా చలించిపోయారు . వెంటనే బులంద్ షహర్ జిల్లాలోని వారి సొంతూరు అమర్ గఢ్ వెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేశారు. స్థానికులు వారికి కొంత ఆహారం తో పాటు నగదు సాయం చేశారు..  మీకు ఉన్నదాంట్లోనే కొంచెం పెట్టైనా పక్కవాళ్లని ఆదుకోవడానికి చూడండి.. కష్టకాలంలో మనిషికి మనిషే తోడు.. అదే మానవత్వం.


End of Article

You may also like