Home Filmy Adda న్యూ ఇయర్ పార్టీ ఫోటోలో… “రామ్ గోపాల్ వర్మ” తో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?

న్యూ ఇయర్ పార్టీ ఫోటోలో… “రామ్ గోపాల్ వర్మ” తో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?

by Mohana Priya

న్యూ ఇయర్ పార్టీని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. సినీ తారలు కూడా కొంత మంది విదేశాలకు వెళ్లి సెలబ్రేట్ చేసుకుంటే, కొంత మంది తమ ఇళ్లల్లోనే సెలబ్రేట్ చేసుకున్నారు.

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా న్యూ ఇయర్ పార్టీని సెలబ్రేట్ చేసుకొని, అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలు ఇప్పుడు వార్తల్లో నిలిచాయి. ఈ ఫోటోలో రామ్ గోపాల్ వర్మతో పాటు ఒక అమ్మాయి కూడా ఉన్నారు.

woman with ram gopal varma in new year party photo

ఆ అమ్మాయి ఎవరు అని సోషల్ మీడియాలో వెతకడం మొదలు పెట్టారు. అంతకుముందు రామ్ గోపాల్ వర్మతో ఫోటోలు దిగి, లేదా ఇంటర్వ్యూలు చేసి ఫేమస్ అయిన సెలబ్రిటీలు చాలా మంది ఉన్నారు. కొంత మంది బిగ్ బాస్ కి కూడా వెళ్లారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరు అంటూ సోషల్ మీడియాలో ఆసక్తి నెలకొంది. ఈ అమ్మాయి గురించి వెతకగా, ఈ అమ్మాయి పేరు సిరి స్టాజీ అని తెలిసింది. ఈమె ఒక ప్రముఖ మోడల్. వీకెండ్ పార్టీ అనే ఒక సినిమాలో కూడా నటించారు.

woman with ram gopal varma in new year party photo

గతంలో రామ్ గోపాల్ వర్మతో సిరి ఇంటర్వ్యూ చేసినట్టు తెలుస్తోంది. అలా రామ్ గోపాల్ వర్మ పార్టీలో కూడా సిరి పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలని రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడు ఏమో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు. మరి ఇప్పుడు సిరి రామ్ గోపాల్ వర్మతో సినిమా చేస్తున్నారా? లేదా కేవలం ఇంటర్వ్యూ మాత్రమే చేశారా? అనే విషయం తెలియాల్సి ఉంది. బహుశా ఈ పాపులారిటీతో నెక్స్ట్ బిగ్ బాస్ లోకి సిరి వెళ్లే అవకాశం కూడా ఉంది.

woman with ram gopal varma in new year party photo

మరొక పక్క రామ్ గోపాల్ వర్మ వరుస పెట్టి సినిమాలు కూడా చేస్తూనే ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమా విడుదల కావాల్సింది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా చాలా సార్లు వాయిదా పడింది. ఇప్పుడు కూడా గత వారం ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ మళ్లీ వాయిదా పడింది. ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించాల్సి ఉంది.

ALSO READ : ఓటిటిలో హిట్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ బ్లాక్ బస్టర్‌ థ్రిల్లర్‌ చూసారా.? స్ట్రీమింగ్ ఎందులో అంటే?

You may also like