Ads
అర్ధరాత్రి సమయం లో పసి పిల్లాడిని మంచం పై వదిలేసి ఓ తల్లి బావి లోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. ఎంతో అందమైన కుటుంబం. ఆమె భర్త హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్ళై ఏడాదిన్నర కాలమైంది. ప్రసవం కోసం పుట్టింటికి వచ్చిన ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడింది.
Video Advertisement
వివరాల్లోకి వెళితే, సమయం కధనం ప్రకారం మజ్జిలిపేటకు చెందిన పైడి ఝన్సీ ని ఆమె తల్లి తండ్రులు శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కింతలి గ్రామానికి చెందిన గిరిబాబు కి ఇచ్చి పెళ్లి చేసారు. వీరికి పెళ్లి అయి ఏడాదిన్నర కాలం గడిచింది. గిరిబాబు హైదరాబాద్ లోనే ఓ బ్యాంకు లో పని చేస్తున్నాడు. ప్రసవం కోసం ఝాన్సీ దాదాపు ఎనిమిది నెలల క్రితమే పుట్టింటికి వచ్చింది. నాలుగు నెలల క్రితమే ఆమె పండంటి బాబుకి జన్మనిచ్చింది. ఆమె భర్త కూడా అడపాదడపా వస్తూ ఆమెను చూసుకుంటున్నాడు.
అంతా సవ్యం గా ఉందన్న టైం లో ఆ అమ్మాయి అకస్మాత్తు గా విగత జీవి గా మారింది. శుక్రవారం అర్ధరాత్రి సమయం లో పసి పిల్లాడు గుక్క పెట్టి ఏడవడం తో.. ఇంట్లో వాళ్ళు ఆమె గదిలోకి వచ్చి చూసారు. మంచం పై తల్లి కనపడకపోవడం తో బాబు ఏడుస్తున్నదని అర్ధమైంది. ముందు బాత్ రూమ్ కి వెళ్ళిందేమో అనుకున్నారు. ఎంత పిలిచినా పలకకపోవడం తో అనుమానం వచ్చి.. చుట్టుపక్కల వెతికారు. ఎక్కడ చూసినా కనపడకపోవడం తో అనుమానం వచ్చి బావి దగ్గరకు వెళ్లి చూడగా.. బావిలో ఆమె విగత జీవి గా పడి ఉంది.
ఈ దుర్ఘటన గురించి పోలీసులకు తెలియగానే శనివారం కేసు నమోదు చేసుకున్నారు. ఆమె మృతదేహాన్ని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులనుంచి వివరాలు సేకరించారు. ఝాన్సీ కొన్ని రోజుల నుంచి తీవ్ర మైన కడుపునొప్పితో బాధపడుతోంది. ఈ నొప్పి భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుందేమోనని కుటుంబసభ్యులు అనుమానించారు. అయితే, ఆమె ఆత్మహత్యకు మరే ఇతర కారణమైనా ఉందేమోనని పోలీసులు విచారణ చేస్తున్నారు.
End of Article