• About Us
  • Contact Us
  • Contribute to Us
  • Privacy Policy
    • Disclaimer
  • Methodology for Fact Checking
  • Sourcing Information

Telugu Adda

Latest Telugu News and Updates | Viral Telugu News Portal

  • Home
  • News
  • Off Beat
  • Human angle
  • Filmy Adda
  • Sports Adda
  • Mythology
  • Health Adda
  • Viral

కళ్ళ ముందే చిరుత కూతురుని ఈడ్చుకుపోతుంటే.. ఈ తల్లి చేసిన పనికి మెచ్చుకోకుండా ఉండలేరు..!

Published on May 13, 2022 by Lakshmi Bharathi

చిరుత పులి కళ్ళెదురుగా కనిపిస్తే చాలు ఎవరైనా భయంతో వణికిపోవాల్సిందే. కనబడితేనే చాలు ఎవరికైనా గుండె గుభేలుమంటుంది. కానీ ఈ తల్లి మాత్రం చిరుతని చూసి అస్సలు బెదరలేదు. సరికదా దానిని ఓ పట్టు పట్టింది. తన పిల్లల జోలికి వస్తే తల్లి ఎలా రియాక్ట్ అవుతుందో అనేది కళ్ళకు కట్టినట్లు చూపించింది.

మహారాష్ట్రలో చంద్రాపూర్ ప్రాంతలోని దుర్గాపూర్ కాంప్లెక్స్‌లో జ్యోతి పుపాల్వర్ నివాసం ఉంటోంది. ఆమెకు మూడేళ్ళ పాప ఉంది. ఆ పాప జోలికి వచ్చిన చిరుత పులి పని పట్టింది జ్యోతి.

tiger

ఇంట్లో పాప ఆకలి కోసం ఏడుస్తుంటే ఆ తల్లి వంట పని మొదలు పెట్టింది. ఆ పిల్లకి తినడానికి ఏదో ఒకటి పెట్టి తన పనిలో పడిపోయింది. ఇంతలో ఎక్కడ నుంచి వచ్చిందో ఓ చిరుత పులి గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లోకి వచ్చింది. అంతే కాదు ఆ పాపను ఎత్తుకుపోవడానికి ప్రయత్నించింది. ఆ పాపను నోట కరుచుకుని బయటకు పోవడానికి ప్రయత్నించింది. అంతలోనే ఆ పాప ఏడుపు లంకించుకోవడంతో ఆ తల్లి కంగారు పడింది.

tiger 1

చిరుత పులి తన పాపని నోట కరుచుకుని పోవడాన్ని చూసిన ఆ తల్లి క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే దుడ్డు కర్ర తీసుకుని ఆ చిరుతని చితకబాదింది. బిడ్డని వదిలే వరకు ఆ పులి వెంట పడి బాదుతూనే ఉంది. చివరకు ఆ పాపను వదిలేసి చిరుత వెనుదిరగాల్సి వచ్చింది. కొద్దీ పాటి గాయాలతో ఆ చిన్నారి పాప ప్రస్తుతం బాగానే ఉంది. చిరుత నుంచి తప్పించిన తరువాత ఆ తల్లి పాపను తీసుకుని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లింది. ప్రస్తుతం ఆ పాప ఆరోగ్యంగానే ఉంది. ఆ తల్లి స్ఫూర్తిని ఆ గ్రామ ప్రజలు ప్రశంసించారు.


We are hiring Content Writers. Click Here to Apply



Search

Recent Posts

  • నందమూరి బాలకృష్ణ నటిస్తున్న “NBK 107” మాస్ పోస్టర్‌పై… సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 10 మీమ్స్..!
  • సీనియర్ ఎన్టీఆర్ గారి పెళ్లి పత్రిక చూసారా.? వివాహం ఎక్కడ జరిగింది అంటే.?
  • “రామ్ గోపాల్ వర్మ” లాగా బిహేవ్ చేస్తున్న రవి శాస్త్రి.. ఓ రేంజ్ లో నెటిజన్స్ ట్రోలింగ్.. ఎందుకంటే..?
  • “ఎప్పటిలాగే అస్సాం ట్రైన్ ఎక్కారుగా.?” అంటూ… క్వాలిఫైయర్ 2 లో RCB ఓడిపోవడంపై 30 ట్రోల్స్.!
  • “నా భార్య ఏ పని చేయదు..?” అన్న భర్తకు “సైకాలజిస్ట్” కౌంటర్.! ప్రతి భర్త తప్పక చదవండి.!

Copyright © 2022 · Telugu Adda Technology by Cult Nerds IT Solutions