Ads
లాటరీ పై చాలామందికి నమ్మకం ఉంటుంది. ఒక్కసారి కూడా లాటరీ రాకపోతే నిరాశ వస్తూనే ఉంటుంది. అయితే.. లీ రోజ్ ఫిగా అనే మహిళ ‘లక్కీ స్టాప్’ పేరుతొ ఉన్న ఓ షాప్ లో లాటరి కొనుగోలు చేసింది. ఆ షాప్ ను ఓ భారతీయ కుటుంబం నిర్వహిస్తోంది. అయితే.. ఆమె ఎప్పటిలానే లాటరీ టికెట్ కొనుగోలు చేసింది. ఐతే.. ఆ టికెట్ ను స్క్రాచ్ చేసి పరధ్యానం గా చూసింది. ఆమె పూర్తి గా స్క్రాచ్ చేయకుండా.. తనకు తగల్లేదు అనుకుని ఆ టికెట్ ను చెత్తబుట్టలో పడేసింది.
Video Advertisement
ఆ తరువాత అక్కడనుంచి వెళ్ళిపోయింది. పదిరోజులు ఆ టికెట్ చెత్తబుట్టలోనే ఉంది. అయితే ఆ షాప్ ఓనర్ యజమాని కుమారుడు అభి షా ఆ టికెట్ ను చూసాడు. పూర్తి గా స్క్రాచ్ చేసి చూడగా.. ఆ టికెట్ కు లాటరీ వచ్చిందని తెలుసుకున్నాడు. తనకు లాటరీ సొంతమైందని అభి సంతోషించాడు. అతని తండ్రికి, నయనమ్మలకు కూడా తెలిపాడు. అయితే.. వారు మాత్రం ఆ సొమ్ము తీసుకోవద్దని.. టికెట్ కొన్నవారికే ఇవ్వాలని సూచించారు. దీనితో.. లీ రోజ్ ఫిగాకు ఈ విషయం చెప్పారు. ఆమె మొదట షాక్ అయింది. తరువాత ఏడ్చేసింది. ఆ తరువాత టికెట్ తీసుకుని లాటరీ ని పొందింది. ఈ భారతీయ ఫ్యామిలీని పలువురు ప్రశంసిస్తున్నారు. టివి ఛానెల్స్ సైతం వారిని ఇంటర్వ్యూ చేస్తున్నాయి.
End of Article