Ads
ప్రతి స్త్రీకి నెలసరి సాధారణం. ప్రతి నెలలో కూడా ప్రతి స్త్రీ సర్వసాధారణంగా దీనిని ఎదుర్కొంటూ ఉంటారు. అయితే చాలా మంది స్త్రీలు నెలసరి కి సంబంధించి కొన్ని విషయాలపై భయపడుతూ ఉంటారు. ఒకవేళ కనుక ఏదైనా తప్పు జరిగితే దీనివల్ల జరిగిపోయింది ఏమో అని అపోహ పడుతుంటారు.
Video Advertisement
నెలసరి కి సంబంధించి ఎప్పుడైనా పొరపాటు జరిగితే ఇంట్లో ఇబ్బందులు రావడానికి కారణం అదేనేమో అని తెగ ఆలోచిస్తూ మానసిక ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటూ ఉంటారు.
నిజానికి దీని వల్ల దోషాలు కలగడం, పాపం రావడం, ఇబ్బందులు కలగడం వంటివి జరగవు. ఇలా పదేపదే అనిపించడంకి కారణం కేవలం మన ఆలోచనలు మాత్రమే. మన ఆలోచనా విధానం వల్లనే ఇది తప్పుగా అనిపిస్తూ ఉంటాయి తప్ప నిజానికి నెలసరి వలన దోషాలు ఇంట్లో సమస్యలు లాంటివి కలగవు. అయితే ఒక్కొక్కసారి ఆడవాళ్ళు దేవాలయం లో ఉన్నప్పుడు నెలసరి రావచ్చు అప్పుడు ఏం చేయాలి అనే సందేహం చాలా మందిలో ఉండే ఉంటుంది.
ఏ స్త్రీ అయినా దేవాలయంలో ఉన్నప్పుడు ఇలా జరిగితే ఈ విధంగా అనుసరిస్తే సరిపోతుంది. దేవాలయంలో నెలసరి రావడం వలన ఎటువంటి దోషాలు కలగవు. మీ ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు రావు. దీని గురించి ఏ మాత్రము చింత పడక్కర్లేదు. ఆలయంలో కానీ పుణ్యక్షేత్రాల్లో కానీ ఇలా జరిగితే వెంటనే మీరు దేవాలయం నుంచి బయటకు వచ్చేయండి. ఇది తప్ప మరో పరిష్కారం లేదు.
దర్శనానికి వెళ్లకుండా దర్శనానికి వెళ్లే వాళ్ళని ముట్టుకోకుండా మీరు దూరంగా ఆలయం నుంచి వచ్చేయండి. ఇదే ఉత్తమమైన మార్గం. దేవాలయంలో ఉన్నప్పుడు నెలసరి వచ్చిందనే కష్టాలు వస్తాయని అనుకోకండి. ఒకవేళ కనుక మీ మనసుకి అది ఏదో తప్పు అని అనిపిస్తే… దుర్గాదేవికి ఎర్రని చీర, ఎర్ర గాజులు వంటివి సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీకు ఏదో తప్పు చేశానన్న బాధ కలగదు. మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. అంతేకానీ దేవాలయంలో ఇలా జరిగితే మీరు ఏదో తప్పు చేసినట్లు కాదు దీని వల్ల మీకు ఎలాంటి సమస్య ఉండదు.
End of Article