అర్ధరాత్రి వచ్చిన ఒక్క కాల్ తో “800” మంది భారతీయుల్ని కాపాడిన ఈ మహిళ ఎవరో తెలుసా?

అర్ధరాత్రి వచ్చిన ఒక్క కాల్ తో “800” మంది భారతీయుల్ని కాపాడిన ఈ మహిళ ఎవరో తెలుసా?

by Megha Varna

Ads

ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం గురించి మనకి తెలిసిందే. నరేంద్ర మోదీ ఆపరేషన్ గంగా ప్రాజెక్టు మొదలు పెట్టి ఉక్రెయిన్ లో చిక్కుకున్న మన భారతీయులను తిరిగి మన దేశానికి జాగ్రత్తగా తీసుకు వచ్చారు. దీనిలో కలకత్తాకు చెందిన యువ మహిళా పైలట్ మహా శ్వేత చక్రవర్తి ధైర్య సాహసాలను చూపించారు.

Video Advertisement

ఆమె ఏకంగా 800 మంది భారతీయులను అక్కడ నుండి ఇక్కడకి చేర్చి తన ప్రతిభ చూపారు. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం జరిగిన సంగతి మనకు తెలుసు.

ఆ యుద్ధం కారణంగా చాలా మంది దేశాన్ని వదిలి వెళ్లిపోయారు. పైగా ఎంతో మంది చనిపోయారు కూడా. వారిలో పిల్లలు, పెద్దలు కూడా ఉన్నారు. ఉక్రెయిన్ నుంచి దాదాపు 18 లక్షల మంది వలస పోయారు అని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. అదే విధంగా ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత పౌరులను మన భారతదేశానికి తిరిగి తీసుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.

ఆపరేషన్ గంగా అనే ప్రాజెక్ట్ ని మోదీ కేంద్ర మంత్రులు అధికారులతో పాటు మొదలుపెట్టారు. దీనికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్క భారత పౌరుడిని కూడా తిరిగి భారతదేశానికి తీసుకురావడం. దీనికోసం యంత్రాంగం 24 గంటలు పని చేస్తుందని మోదీ చెప్పారు. పైగా పిల్లల కోసం ప్రత్యేక విమానాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే సైన్యాన్ని సైతం రంగంలోకి దింపారు.

ఇది ఇలా ఉంటే ఆపరేషన్ గంగని కలకత్తాకు చెందిన 24 ఏళ్ళ మహాశ్వేతాదేవి అపార దైర్య సాహసాలను చూపించారు. చిన్నతనం నుండి కూడా ఆమెకి పైలెట్ అవ్వాలని ఆశ. అందుకోసమే ఆమె ఎంతో కష్టపడి చదివారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఇందిరాగాంధీ రాష్ట్ర ఉడాన్ అకాడమీలో డిగ్రీని ఈమె పూర్తిచేశారు. పైలెట్ గా గత నాలుగేళ్లుగా ఇండిగో ఎయిర్ లైన్స్ లో ఈమె పని చేస్తున్నారు.

ఆపరేషన్ గంగా ప్రాజెక్టు కోసం ఈమె కి ఓ అర్ధరాత్రి ఫోన్ వచ్చింది. ఆ తర్వాత ఆమె బాధ్యతని సక్రమంగా నిర్వహించారు. ఉక్రెయిన్ వెళ్లి ఆపరేషన్ గంగ ప్రాజెక్టు లో ఈమె ఫిబ్రవరి 27 నుంచి మార్చి 7 వరకు పాల్గొన్నారు. దాదాపు 800 మంది భారతీయులను సేఫ్ గా ఇండియాకి తీసుకొచ్చారు. ఈమె ధైర్య సాహసాలకు బీజేపీ మహిళ మోర్చా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా వైస్ ప్రెసిడెంట్ ప్రియాంక శర్మ ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు.


End of Article

You may also like