Ads
భర్తలపై భార్యలకు అనుమానం వస్తుండడం సహజమే. అయితే.. ఏది మితిమీరి అవతలి వారికి ఇబ్బందికలిగించే విధం గా ఉండకూడదు. భర్త చెప్పే విషయాన్నీ కూడా విని అర్ధం చేసుకోవాలి. ఇవేవి ఆలోచించకుండా.. కేవలం భర్త పై అనుమానం తో భర్త ఫోన్ పై నిఘా పెట్టింది దుబాయ్ కి చెందిన ఓ మహిళ. ఆమె భర్త లేని సమయం లో ఫోన్ చెక్ చేయడం, అతని పనులను ఆరాతీయడం వంటివి చేసేది.
Video Advertisement
దీనితో.. విసుగు చెందిన భర్త కేసు పెట్టాడు. కోర్టు లో తన ఇబ్బందులను తెలియచెప్పాడు. కుటుంబం లో తనను అవమానించిందని, మానసిక శాంతి లేకుండా చేసిందని, తన ప్రైవసీ కి భంగం కలిగించిందని, ఇంట్లో వారి ముందు తలెత్తుకోనివ్వకుండా చేసిందంటూ ఆరోపించారు. ఈ కేసు కారణం గా ఆఫీస్ కి కూడా వెళ్లలేక, జీతం అందుకోలేకపోయానని.. ఈ న్యాయవాది ఫీజు కూడా ఆమెనే చెల్లించాల్సింది గా కోరుతున్నానని కోర్టు కు విన్నవించాడు సదరు భర్త. ఆమె డేటా సేకరించిన ఆధారాలను కూడా చూపించాడు. దీనితో.. ఆమె తన భర్త కు లక్ష నష్ట పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. సదరు మహిళ తరపు న్యాయవాది కూడా భర్త ఇబ్బందిపెట్టినట్లు చెప్పగా… ఆధారాలు ఇవ్వాలని జడ్జి పేర్కొన్నారు.
End of Article