Ads
భార్యాభర్తలు అన్నాక అభిప్రాయ భేదాలు, మనస్పర్థలు సహజంగానే వస్తూ ఉంటాయి. ఉన్నట్లుండి ఆవేశంలో అఘాయిత్యాలు చేసుకోవడం మాత్రం సరికాదు. సాధారణంగా ఆర్ధిక ఇబ్బందుల వల్లో, ఆకలి బాధల వల్లో, లేక భర్త చెడు అలవాట్లు ఇబ్బంది పెడుతుంటేనో.. ఉండే ఇక్కట్లు అన్ని ఇన్ని కావు.
Video Advertisement
ఇలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఎందరో భార్యలు ధైర్యంగా నిలబడి సంసారాలను చక్కదిద్దుకుంటున్నారు. కానీ, బెంగళూరుకు చెందిన ఈ జంట సంసారం అల్లకల్లోలం అయ్యింది.
న్యూస్ 18 కధనం ప్రకారం, బెంగళూరు కు చెందిన అమృతహళ్లిలోని వీరన్ పాళ్యాలో సంగీత, వినయ్ లు నివాసం ఉంటున్నారు. వీరికి కొన్నేళ్ల క్రితమే పెళ్లయింది. ఇద్దరిదీ చీకు చింతా లేని జీవితం. వారికొచ్చే జీతాలతో జీవితాంతం సుఖంగా గడిపేయచ్చు. ఇద్దరికీ ఆకర్షణీయమైన జీతం లభిస్తోంది.
వీరిద్దరికి పెళ్ళైన తరువాత కొంతకాలం బాగా అన్యోన్యంగానే ఉన్నారు. ఎంతో అన్యోన్యంగా ఉన్నా ఈ జంట మధ్య ఏమి జరిగిందో తెలియదు. మనస్పర్థలు రావడంతో భార్య సంగీత తీవ్ర మనస్థాపానికి గురి అయింది. వినయ్ వలన ఆమె ఏమి ఇబ్బందులు పడుతోందో తెలియదు. వినయ్, సంగీత ల మధ్య నిత్యం ఘర్షణ జరుగుతుండేది.
గత కొన్ని రోజులుగా సంగీత వినయ్ తో గొడవల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురి అయింది. కనీసం ఉద్యోగంలో తన విధులను కూడా సక్రమంగా నిర్వర్తించలేకపోయింది. ఈ క్రమంలో ఆమెపై ఒత్తిడి పెరిగింది. ఎంత చర్చించుకున్నా వినయ్ లో మార్పు రాకపోవడంతో ఆమె సహించలేకపోయింది. ఆ దుఃఖంలో ఆత్మహత్య చేసుకుంది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆమె ప్రాణాలను బలిగొంది. ఆమె ఆత్మహత్య చేసుకున్న గదిలో సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. అయితే… ఈ నోట్ లో ఏముంది అన్న విషయాన్ని మాత్రం పోలీసులు వెల్లడించలేదు.
End of Article