Ads
రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ ప్రధాన పాత్రలలో చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ సినిమా రిలీజ్ కు ముందు నుండే వివాదాలకు, విమర్శలకు కేంద్రబిందువుగా మారింది. టీజర్ తో మొదలైన విమర్శలు మూవీ రిలీజ్ అయిన తరువాత మరింతగా పెరిగాయి.
Video Advertisement
ఆడియెన్స్ నుండి ప్రముఖుల వరకు దర్శకుడు ఓం రౌత్ ను, డైలాగ్స్ రచయిత మనోజ్ శుక్లాను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా హనుమంతుడు చెప్పిన డైలాగ్స్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో ఆ డైలాగ్స్ మారచడం జరిగింది. తాజాగా ఆదిపురుష్ రైటర్ మనోజ్ శుక్లా ట్వీట్ చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రభాస్ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ లో సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. ఈ చిత్రం జూన్ 16న విడుదల అయ్యింది. మొదటి షో నుండే మూవీలో పాత్రల ఆహార్యం పై, డైలాగ్స్ పై నెటిజన్లు, ఆడియెన్స్ సినిమాపై, దర్శకుడు ఓం రౌత్ పై తీవ్రమైన విమర్శలు, ట్రోల్స్ చేశారు.
ఈ చిత్రంలోని హనుమంతుడు చెప్పే డైలాగ్స్ తప్పుగా ఉన్నాయని సోషల్ మీడియాలో ఆదిపురుష్ యూనిట్ పై, రచయిత నెటిజెన్లు మండిపడ్డారు. ఆ డైలాగ్స్ పై పెద్ద ఎత్తున వివాదం వచ్చింది. పలు కోర్టులలో పీటీషన్లు కూడా వేశారు. బ్యాన్ చేయాలనే నిరసనలు చేశారు. మొన్నటివరకు ఈ డైలాగ్స్ ని రాసిన రైటర్ మనోజ్ శుక్ల సమర్ధించుకున్నాడు. ఆ తరువాత అతని పై మరింత ట్రోలింగ్ పెరిగింది.
మనోజ్ శుక్ల మనోజ్ ముతాంషీర్ పేరుతో కూడా చాలా గుర్తుంపు సంపాదించుకున్నారు. తాజాగా ఆయన తన సోషల్ మీడియా ఖాతా నుండి ట్వీట్ చేశారు. అందులో, “ఆదిపురుష్ సినిమా వల్ల ప్రజల భావోద్వేగాలు దెబ్బతిన్నాయి అనే విషయాన్ని నేను అంగీకరిస్తున్నాను. చేతులు జోడించి మీకు క్షమాపణలు చెప్తున్నాను. ప్రభు బజరంగ్ బలి మనందరినీ ఐక్యంగా ఉంచి, మన పవిత్రమైన సనాతన ధర్మానికి, మన గొప్ప దేశానికి సేవ చేసే శక్తిని ప్రసాదించాలి అని వేడుకుంటున్నాను”. అని మనోజ్ శుక్ల రాసుకొచ్చారు.
Also Read: “ఐదుగురు వచ్చి దాడి చేశారు..!” అంటూ… “రాకేష్ మాస్టర్” భార్య కామెంట్స్..? ఏం జరిగిందంటే..?
End of Article