Ads
కరోనా వైరస్ థాటికి ప్రపంచదేశాలన్ని వణికిపోతున్నాయి. ఇప్పటివరకు 161 దేశాల్లో కరోనా వైరస్ ప్రభలి తొమ్మిదివేల మంది వరకు ప్రాణనష్టం సంభవించింది. ఇంకా రెండు లక్షల పాతిక వేలమందికి పైగా కరోనా బారిన పడిన వారున్నారు. వాళ్లల్లో పదివేలమంది కండిషన్ చాలా సీరియస్ గాఉంది . మొత్తం దేశాలకు దేశాలే తమని తాము కట్టడి చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే మొట్టమొదటగా వైరస్ దాడికి గురైన చైనా మాత్రం ఇప్పుడు పూర్తిగా కోలుకుంది.
Video Advertisement
చైనాలోని వూహాన్ నగరంలో మొదటి కరోనా కేసు నమోదైంది అనే విషయం అందరికి తెలిసిందే. వూహన్ నగరం మొత్తం వైరస్ దాడికి గురై అస్తవ్యస్తం అయింది. వైరస్ బారిన పడుతున్న రోగుల సంఖ్య పెరగడంతో వెయ్యి పడకల హాస్పటల్ ని నిర్మించడమే కాదు, ఎక్కడిక్కడ హోటల్లలాంటి పెద్ద పెద్ద భవనాల్ని హాస్పటిల్స్ గా మార్చేసింది చైనా ప్రభుత్వం.
సుమారు నాలుగు నెలల క్రితం అనగా గతేడాది డిసెంబరు నుండి ఊహాన్ లో ఎక్కడిక్కడ నగరం మొత్తం స్తంబించిపోయింది . ఎక్కడిక్కడ అపార్ట్మెంట్స్, ఇల్లు వాళ్లకి వాళ్లే ఐసోలేషన్లోకి వెళ్లిపోయిన పరిస్థితి. మొత్తం వూహాన్ నగరం మొత్తం తనని తాను క్వారెంటైన్లోకి మార్చేసుకుంది. అలాంటి పరిస్తితి నుండి చైనా కోలుకుంది. కొత్తగా నిర్మించిన హాస్పిటల్ నుండి చివరి పేషెంట్ కి క్యూర్ చేసి పంపించేసి, ఊపిరి పీల్చుకుంది.ఇప్పుడు చైనాలో కరోనా కేసుల నమోదు శాతం పూర్తిగా తగ్గిపోయింది. కొత్తగా నమోదైన 34 కేసులు విదేశీయులవే.
చైనా ప్రభుత్వం, మెడికల్ టీం మొత్తం నాలుగు నెలల పాటు కష్టపడి కరోనాను పూర్తిగా అక్కడ అదుపులోకి తీసుకురాగలిగారు. వూహాన్ సిటీ ఇప్పుడు వెలిగిపోతుంది. లైట్లతో వెలిగిపోతున్న ఊమాన్ సిటీ బిల్డింగ్ ఫోటోలను ట్విటర్లో పోస్టు చేసింది చైనా మీడియా. సో షల్ మీడియాలో వైరలవుతున్న ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు చైనా కృషిని అభినందిస్తున్నారు. మిగతా ప్రపంచం చైనాను చూసి నేర్చుకోవాలని కామెంట్ చేస్తున్నారు.
ఊహాన్ లో ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ల బృందాన్ని చైనా ఇటలీ పంపిన విషయం విధితమే. ఇటలీలో పరిస్థితి చైనాను మించి మరీ దారుణంగా ఉంది. మరో వైపు మన దేశంలో ఐదు మరణాలు నమోదవగా 175 కేసులు నమోదయ్యాయి. చైనా మాదిరిగానే ప్రపంచం మొత్తం కరోనాని ఎదుర్కోవాలని, త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం.
Buildings in Wuhan are illuminated with slogans cheering for dedicated medics, as no new infections of the novel coronavirus were reported on Wednesday in the city #COVID19 https://t.co/Y5FHToBNIb pic.twitter.com/tqqeXK0l8d
— China Xinhua News (@XHNews) March 19, 2020
End of Article