Ads
సాధారణంగా మనుషులు వేరొకరి వస్తువులపైన, డబ్బు పైన ఆశపడటం చూస్తూనే ఉంటా వాటి కోసం కొన్ని సందర్భాల్లో దొంగతనాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఒకసారి ఒకరి వద్ద నుంచి దొంగలించిన వస్తువుల్ని సాధారణంగా తిరిగి ఇవ్వడం అనేది జరగదు ఎక్కడో వేదం సినిమాలో చూపించినట్లుగా హీరో తన తప్పును తెలుసుకుని తాను దొంగలించిన ధనాన్ని ఆ పేదవానికి మరలా తిరిగి ఇచ్చినట్టుగా జరగడం అనేది చాలా వరకు అసాధ్యమనే చెప్పాలి కానీ అటువంటి సంఘటనే నిజజీవితంలో కూడా జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్ లో రామన్న అనే ఒక వ్యక్తి మద్యం తాగడం కోసం దుకాణానికి వచ్చి అక్కడే తన బైక్ నిలిపి మద్యం దుకాణానికి వెళ్లి తన స్నేహితులతో కలిసి మద్యం సేవించి వచ్చి చూడగా అక్కడ నిలిపిన తన వాహనం కనిపించలేదు .
Video Advertisement
వెంటనే అప్రమత్తమైన వ్యక్తి దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు కాగా మరుసటి రోజు అదే దుకాణానికి వచ్చి చూడగా బైక్ నిలిపి ఉంచిన ప్రదేశం లోనే ఉంది. అంతేకాకుండా దానిలో ఒక లెటర్ రాసి పెట్టి ఉంది ఆ లెటర్ లో ‘ డబ్బులు తీసుకోవడానికి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది కానీ అడుగుదాం అంటే ఎవరు ఇక్కడ లేకపోవడంతో చెప్పకుండా బైక్ ని తీసుకుని వెళ్లాను చెప్పకుండా తీసుకువెళ్లాలని అని ఏమీ అనుకోకు బాబాయ్ ‘ అని రాసి ఉంది. ఇది చూసిన పోలీసులు స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.
End of Article