Ads
ఎస్వీ కృష్ణారెడ్డి – అలీ కాంబినేషన్ లో వచ్చిన సినిమా యమలీల. ఇందులో ఇందులో ఇంద్రజ హీరోయిన్ గా నటించగా, మంజు భార్గవి గారు ఒక ముఖ్య పాత్రలో నటించారు. స్టోరీ చాలా కొత్తగా ఉండటంతో విడుదలైనప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 1994లో విడుదలైన ఈ సినిమాకు ఇప్పటికీ చాలా క్రేజ్ ఉంది. ఈ సినిమాకి ఎస్వీ కృష్ణారెడ్డి సంగీత దర్శకత్వం వహించారు.
Video Advertisement
2014 లో యమలీల 2 గా ఈ సినిమాకి సీక్వెల్ కూడా వచ్చింది. కొంతకాలం క్రితం ఈటీవీలో యమలీల పేరుతో సీరియల్ కూడా మొదలైంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఒక ఇంటర్వ్యూలో ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పారు. ముందుగా ఈ సినిమాలో హీరోగా మహేష్ బాబుని అనుకున్నారు అనే విషయం మనలో కొంత మందికి అయినా తెలిసే ఉంటుంది.
తర్వాత అలీ హీరోగా యమలీల సినిమా చేద్దామని అనుకున్నారు ఎస్వీ కృష్ణారెడ్డి. హీరోయిన్ స్థానంలో కూడా ముందు మరొక నటిని అనుకున్నారట. యమలీల సినిమాలో హీరోయిన్ గా మొదట సౌందర్య గారిని సంప్రదించారట. అప్పటికి సౌందర్య గారు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. దాంతో యమలీల సినిమా చేయడానికి కొంచెం సంకోచించారట.
దాంతో, ఆ తర్వాత హీరోయిన్ గా ఇంద్రజ చేశారు. ఈ విషయంపై ఎస్వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, అందులో సౌందర్య గారి తప్పు ఏమీ లేదు అని, కెరియర్ కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అనే విషయం గురించి ఆలోచించి భయపడటం అనేది సహజం అని అన్నారు. అయితే తర్వాత అలీ ఇంకా సౌందర్య గారు కలిసి శుభలగ్నం సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
watch video:
End of Article