Ads
మరొక నాలుగు నెలలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సిపి పార్టీకి గట్టి షాక్ తగిలిందని తెలుస్తోంది. వైఎస్ఆర్సిపి పార్టీలో ఎమ్మెల్యేగా ఎంతో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఒక్కసారిగా ఏపీ రాష్ట్ర రాజకీయాలలో చర్చలకు కారణమైంది. ఇలా ఉన్నఫలంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయడానికి గల కారణం ఏంటి అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి.
Video Advertisement
ఈ సందర్భంగా నేడు ఉదయం ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ రాజీనామా లేఖను స్పీకర్ తమ్మినేని సీతారాంకు పంపించారు. ఇలా ఉన్నఫలంగా రామకృష్ణారెడ్డి పార్టీ నుంచి తప్పుకోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయం మాత్రం తెలియడం లేదు. ఇలా తన ఎమ్మెల్యే పదవికి మాత్రమే రాజీనామా చేయడమే కాకుండా వైఎస్ఆర్సిపి పార్టీ సభ్యత్వానికి కూడా ఈయన రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు.
తాను వైయస్సార్ హయాంలోని రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ తనకు రాలేదు ఆయనప్పటికి నేను వైయస్సార్ గారిని కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు కూడా వీడలేదని వారిని ఒక్క మాట కూడా అనలేదని ఈయన మీడియా సమావేశంలో తెలిపారు. అదే విధంగా వైఎస్సార్సీపీ పార్టీని స్థాపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు తాను ఈ పార్టీలోకి వచ్చాను ఆయన నాకు రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు అందుకు తనకు ధన్యవాదాలు అంటూ తెలియజేశారు.
ఉన్నఫలంగా తాను పార్టీ నుంచి తొలగిపోవడానికి నా వ్యక్తిగత కారణాలే కారణమని ఈయన చెప్పకు వచ్చారు. అయితే టీవీ 9 కథనం ప్రకారం ఈయన రాజీనామా చేయడానికి కారణం హై కమాండ్ ఈయనని గత కొంతకాలంగా దూరం పెడుతూ రావడమే రావడమనే అని అంటున్నారు.ఆళ్ల రామకృష్ణారెడ్డికి తెలియకుండా తన నియోజకవర్గంలో పార్టీకి సంబంధించినటువంటి ఎన్నో పనులు జరుగుతున్నాయి దీంతో ఆయన కాస్త అసంతృప్తికి లోనయ్యారని అని అంటున్నారు. ఇటీవల వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన ఆ విషయం కూడా ఆయనకీ తెలీదు అంట. ఇక ఈ పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ గంజి చిరంజీవిని ఆహ్వానించి ఆయన చేతుల మీదుగా జరిపించారు.
ఇలా పార్టీ హై కమాండ్ తనని ఏ విషయంలోనూ దగ్గరకు రానీయకుండా దూరం పెట్టడంతోనే అసంతృప్తికి లోనయ్యారని అలాగే వచ్చే ఎన్నికలలో రెడ్డి సామాజిక వర్గానికి కాకుండా బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది.మరి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నఫలంగా పార్టీకి అలాగే ఎమ్మెల్యే పదవికి దూరం కావడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియదు.రాజానామాకి కారణాన్ని ఆయన స్వయంగా చెప్తారో లేదో చూడాలి.
End of Article