“కొత్త దంపతుల్లా అలంకరించి అంత్యక్రియలు చేయండి..” అంటూ భార్య తో సహా ఆత్మహత్య.. అసలేమైందంటే..?

“కొత్త దంపతుల్లా అలంకరించి అంత్యక్రియలు చేయండి..” అంటూ భార్య తో సహా ఆత్మహత్య.. అసలేమైందంటే..?

by Anudeep

Ads

అతను బ్యాంకు లో ఉద్యోగి. అతని భార్య గృహిణి. ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ భార్య భర్తలు భవిష్యత్ కోసం చాలానే కలలు కన్నారు. వారి జీవితానికి ఏమైందో ఏమో.. ఉన్నట్లుండి ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు. మమ్మల్ని కొత్త దంపతుల్లా అలంకరించి అంత్య క్రియలు చేయండి అంటూ ఓ లేఖ రాసి భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. మధ్యప్రదేశ్ లో ఇండోర్ ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

Video Advertisement

వివరాల్లోకి వెళ్తే,  ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం ఇండోర్ కి చెందిన మోను అలియాస్ సూర్య ప్రకాష్ గుప్తా అనే వ్యక్తి బ్యాంకు లో ఉద్యోగం చేస్తున్నారు. అతనికి అంజలి అనే అమ్మాయితో గతంలోనే వివాహం జరిగింది. వీరు గ్రీన్ వ్యూ కాలనీలోని ఆయుష్మాన్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. అన్యోన్యంగా జీవనం సాగిస్తున్న వీరు మంగళవారం ఊహించని నిర్ణయం తీసుకున్నారు.

monu anjali

ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి.. విషం తాగి ఆత్మహత్యకి పాల్పడ్డారు. కాగా.. విషయం తెలియగానే ఆ దంపతుల కుటుంబ సభ్యులు వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆసుపత్రికి తరలిస్తుండగానే మోను చనిపోయాడు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న అంజలి బుధవారం చనిపోయింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. “మేము బాగా అలిసిపోయాం.. బ్రతికే ధైర్యం , కష్టాలను ఎదుర్కునే శక్తీ మాకు లేదు. నా పేరుపై ఉన్న భూమి నా తల్లి పేరుమీదకి రాయండి..” అంటూ మోను రాసాడు.

అంజలి కూడా సూసైడ్ నోట్ రాసింది. “నా పెళ్ళికి ఇచ్చిన వెండి, బంగారు నగలను.. నా చెల్లి సాక్షికి ఇవ్వాలి. మా అంత్యక్రియలు చేసేటపుడు నన్ను బాగా అలంకరించండి. మా ఇద్దరినీ కొత్త వధూవరుల్లా అలంకరించి అంత్యక్రియలు చేయండి.. అమ్మా.. నాన్న నా చావుకి కారణం అత్తా మామ అని అనుకోవద్దు. మా ఇష్టానుసారమే చనిపోతున్నాం..మా చావుకి ఎవరు కారణం కాదు.. కష్టాలను ఓర్చుకుని, ఎదుర్కొనే శక్తీ మాకు లేదు.. మమ్మల్ని క్షమించండి.. లవ్ యు మమ్మీ, డాడి, లల్లి..” అంటూ లేఖ లో పేర్కొన్నారు.


End of Article

You may also like