Ads
కొన్ని కొన్ని సార్లు మన జీవితం లో ఊహించని విషాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మనం ఎంతో కష్టపడి కట్టుకున్న ఆశల సౌధాన్ని కూల్చివేస్తూ ఉంటాయి. ఈ అమ్మాయి విషయం లో అదే జరిగింది. మంగళూరు ఎస్పీ ఆఫీసులో విధులు నిర్వర్తిస్తున్న మహిళా పోలీస్ షాలిని కరోనా కారణం గా లోకాన్ని వీడింది. 24 ఏళ్ల వయసుకే పోలీస్ అయిన షాలిని ప్రస్తుతం ఏడు నెలల గర్భవతి.
Video Advertisement
ఏప్రిల్ 20 న ఆమె మెటర్నిటీ సెలవు తీసుకుని సొంత ఊరైన కోలార్ కు వెళ్ళింది. ఆ తరువాత ఆమెకు కరోనా లక్షణాలు కనిపించడం తో టెస్ట్ చేయించుకుంది. పాజిటివ్ గా తేలడం తో ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రి లో చేర్పించారు. జాలప్ప ఆసుపత్రి లో ఆమె చికిత్స తీసుకుంటూ మే 18 న మరణించింది. ఎప్పుడు నవ్వుతు హుషారు గా ఉండే షాలిని ఇక లేదన్న విషయాన్నీ ఆమె కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.
End of Article