అమ్మ మీద అలిగి ఆరేళ్లుగా ఏం చేసాడో తెలుసా.? ఫ్రెండ్స్ తో కలిసి .?

అమ్మ మీద అలిగి ఆరేళ్లుగా ఏం చేసాడో తెలుసా.? ఫ్రెండ్స్ తో కలిసి .?

by Anudeep

Ads

సాధారణం గా ఇంట్లో మనం చేసే అల్లరి పనులకు అమ్మలు తిట్టడం కామన్.. మనం కూడా కాసేపు ఏడ్చి తరువాత మర్చిపోతాం.. కొంచం పెద్దవాళ్ళం అయితే.. ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ వస్తూ ఉంటాం. కానీ ఓ టీనేజర్ మాత్రం ఇంట్లోనే అండర్ గ్రౌండ్ లో ఇల్లు కట్టేసాడు. అందులో తన కోసం సింగల్ బెడ్ తో సహా అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాడు. ఆరేళ్ళు గా ఆ ఇంట్లో గడుపుతున్నాడట.

Video Advertisement

built house 3

ఇంతకీ అసలు విషయం లోకి వెళ్తే, ఆండ్రెస్ కాంటో అనే టీనేజర్ ఆరేళ్ళ క్రితం తన తల్లితో గొడవపడ్డాడట. బయటకు వెళ్లి వచ్చినతరువాత తన తల్లి దుస్తులు మార్చుకోమంటే ఆండ్రెస్ కాంటో వినలేదట. దీనితో వారిద్దరికీ గొడవ వచ్చింది. ఆ కోపం లో ఉన్న ఆండ్రెస్ కాంటో తన గది దాటి బయటకు రాలేదట. అలా కోపం లోనే, తన రూమ్ లో ఓ చోట గునపం తీసుకుని తవ్వడం ప్రారంభించాడట. అలా మూడేళ్లపాటు రోజు మధ్యాహ్నం వరకు తవ్వే వాడట.

built house 2

అలా తవ్వుతూ లోపలే ఓ అండర్ గ్రౌండ్ బంకర్ ను తయారు చేసాడు. మెట్లు, హీటింగ్, స్టీరియో సిస్టమ్స్ వంటివాటిని ఏర్పాటు చేసుకున్నాడు. ఒవేన్, సింగల్ బెడ్ ను కూడా సిద్ధం చేసుకున్నాడట. ప్రస్తుతం రోజులో తానూ రిలాక్స్ అవడం కోసం ఓ 5 గంటల పాటు ఆ ఇంట్లోనే గడుపుతాడట. తన కష్టానికి ఇంకొన్ని తెలివితేటలను కూడా కలుపుకుని లోపలే వైఫై సిస్టం ను కూడా ఏర్పాటు చేసుకున్నాడట. మార్చి 2015 లో ఇలా తవ్వడం స్టార్ట్ చేసాడట. కొన్ని రోజులకు ఫ్రెండ్ సాయం తీసుకుని, డ్రిల్స్ ను ఉపయోగించి మరింత గా మెరుగుదిద్దారట.

built house 4

2017 లో ఆ ప్లేస్ ను ఇల్లులా మార్చాలన్న ఆలోచన వచ్చిందట. ప్రస్తుతం ఆ ఇంట్లో తన నలుగురు ఫ్రెండ్స్ పట్టేంత ప్లేస్ కూడా ఉందట. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి అక్కడే బీర్ తాగుతూ ఎంజాయ్ చేస్తారట. ఇంకా ఏమైనా సలహాలు కావాలంటే తన ఫామిలీ మెంబెర్స్ చెబుతూ ఉంటారట. ఏదైనా సరే కొంత క్రియేటివిటీ.. కష్టపడే స్వభావం ఉంటె వినుతనమైన పనులను చేయచ్చు.


End of Article

You may also like