Home Politics చిరంజీవి స్టైల్ లో “బంగీ జంపింగ్” చేస్తున్న వైయస్ జగన్.! వీడియో వైరల్..!

చిరంజీవి స్టైల్ లో “బంగీ జంపింగ్” చేస్తున్న వైయస్ జగన్.! వీడియో వైరల్..!

by Mohana Priya

సెలబ్రిటీలు అంటే జనాలకి ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. వారు ఏం చేస్తూ ఉంటారు? ఎక్కడ ఉన్నారు? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ ఆసక్తిని గమనించిన మీడియా కూడా సెలబ్రిటీల గురించి వీలైనంత సమాచారాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు.

కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించిన చిన్న విషయాలు కూడా తొందరగా వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీలు అంటే కేవలం సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే కాదు రాజకీయ రంగానికి సంబంధించిన ప్రముఖులు కూడా ఈ లిస్ట్ లోకి వస్తారు.

అదేవిధంగా ఇప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఒక వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. న్యూజిలాండ్ లో జగన్ బంగీ జంపింగ్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోని వైయస్ జగన్ హాలిక్ అనే ఒక పేజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో జగన్ బంగీ జంప్ చేస్తున్నారు. ఈ వీడియో దాదాపు 1.4 లక్షల లైక్స్ సంపాదించింది. అంతే కాకుండా చాలా మంది ఈ వీడియోపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో 2018 లోది అని తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

watch video :

https://www.instagram.com/p/CYns54EB0pB/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

You may also like