Ads
ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం నాడు అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కూడా హాజరయ్యారు. మాజీమంత్రులు శైలజానాథ్, రఘువీరారెడ్డితో సహా ఇతర కాంగ్రెస్ నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
Video Advertisement
ఈ సమావేశంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ “ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులను హరిస్తున్నారు. వారికి అన్యాయం జరుగుతోంది. బీజేపీకి వైసీపీ, టీడీపీలు బానిసలుగా మారి, రాష్ట్రం యొక్క ప్రయోజనాలు తాకట్టు పెట్టారని, బీజేపీ బానిసలు అయిన చంద్రబాబుకి, జగన్‌కి ఎందుకు ఓటు వేయాలని అన్నారు. ఏపీ నా పుట్టినిల్లు, రాష్ట్ర ప్రజల హక్కుల గురించి పోరాడడానికి మీ వైఎస్ఆర్ బిడ్డను అంటూ వైఎస్ షర్మిల చెప్పుకొచ్చారు.
వైఎస్ఆర్ రక్తమే తనలో కూడా ప్రవహిస్తోందన్న షర్మిల, దాడులు చేస్తే భయపడడనని వెల్లడించారు. ప్రజల కోసం పోరాడుతుంటే తనపై దాడులు చేస్తున్నారని వైఎస్ షర్మిల అన్నారు. తన పై ఎన్ని దాడులు జరిగిన పరవాలేదని, తన ఫ్యామిలీని చీల్చినా పర్వాలేదు. రాష్ట్ర ప్రయోజనాలకు ఎలాంటి త్యాగం చేయడానికి రెడీగా ఉన్నానని వైఎస్ షర్మిల వెల్లడించారు. జగన్ అన్న ఇచ్చిన హామీ ఒక్కటి కూడా తీరలేదు. ప్రతి ఏడాది జనవరి 1న జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. ఐదు సంవత్సరాలు ఒక్క జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదని, కనీసం డీఎస్సీ ఒకటి కూడా లేదని షర్మిల అన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పాలనకు, జగనన్న పాలనకు మధ్య ఆకాశానికి, పాతాళానికి ఉన్న తేడా ఉందని ఆమె అన్నారు. వైఎస్ రాజశేఖరెడ్డి కలలను తీర్చలేని వైఎస్ జగన్ ఆయన వారసుడు ఎలా అవుతారని అడిగారు. ఇచ్చిన మాట తప్పిన జగనన్న ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వైసీపీ కోసం 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ పార్టీని నిలబెట్టిన, నా పైన కృతజ్ఞత కూడా లేకుండా పర్సనల్ లైఫ్ పై అటాక్ చేస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివాటికి తాను భయపడనని వైఎస్ షర్మిల వెల్లడించారు.
End of Article