Ads
గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అంతా హాజరు అయ్యారు. ఈ నిశ్చితార్థం వేడుకలో అన్నా చెల్లెళ్ల మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయని తెలుస్తోంది.
Video Advertisement
షర్మిల కుమారుడు రాజారెడ్డి ఎంగేజ్మెంట్ కు ఆమె అన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ హాజరు అయ్యారు. కానీ షర్మిల అన్నతో అంతగా మాట్లాడలేదని ఆ వేడుకకు హాజరైనవారు అంటున్నారు. జగనే స్వయంగా కల్పించుకుని ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించినప్పటికీ షర్మిల అంతగా రెస్పాండ్ కాలేదని చెబుతున్నారు.
వైఎస్ షర్మిల తనయుడి ఎంగేజ్మెంట్ ఆహ్వాన పత్రికలను గత పది రోజుల నుండి రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులను కలిసి అందచేసిన విషయం తెలిసిందే. వాటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే షర్మిల అందరికన్నా ముందుగా ఆహ్వాన పత్రికను తన అన్న జగన్ కు అందచేశారు. కానీ దానికి సంబంధించిన ఫోటో లేదా వీడియో ఎక్కడా కనిపించలేదు. అటు వైసీపీ కానీ ఇటు షర్మిల కానీ వాటిని రిలీజ్ చేయలేదు. అయితే తాజాగా నిశ్చితార్థంకు జగన్ హాజరైన ఫోటోలు, వీడియోలు సీఎంఓ ప్రతినిధులే రిలీజ్ చేశారు. ఇందుకు కారణం ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ గా షర్మిల అవడమే అంటున్నారు.
ఇక కొడుకు నిశ్చితార్థంకు ఆహ్వానించిన షర్మిల, వైఎస్ జగన్, భారతిలను పట్టించుకోలేదని, జగన్ వచ్చి, వెళ్లేంత వరకు అన్నా చెల్లెళ్ళు అంతగా కలవలేదని టాక్. ఫోటో దిగడం కోసం స్వయంగా జగన్ పిలిచినా షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్ పట్టించుకోలేదు. దాంతో జగన్, భారతి బొకే ఇచ్చి వెంటనే వేడుక నుండి వెళ్లిపోయారు. ఇదంతా చూసినవారు జగన్ కలవాలని చూసినా షర్మిలే దూరంగా ఉంటున్నారని అక్కడికి వచ్చినవారు అంటున్నారు. జగన్ తన చెల్లిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకోవాలని చూసినా ఆమె అన్న వైపు చూడలేదని ఇతర అతిథులు అంటున్నారు.
అయితే ఇదే వేడుకకు వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ స్వయంగా ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నంత సమయం ఆయనతో చాలా ఆప్యాయంగా మాట్లాడారు. అన్నతో ఫోటోకు దూరంగా ఉన్న షర్మిల, బ్రదర్ అనిల్, పవన్ కళ్యాణ్ పక్కన ఫోటో దిగడం. రాజకీయంగా జగన్ శత్రువు అయిన పవన్ కళ్యాణ్ కు షర్మిల ఇంతటి ఆదరం చూపడంతో అన్నాచెల్లెళ్ల మధ్య విబేధాలు పెరిగిపోయాయని అంటున్నారు.
Also Read: తన కొడుకు ఎంగేజ్మెంట్ కి వైఎస్ షర్మిల ప్రత్యర్ధులను కూడా ఎందుకు ఆహ్వానించారు..? కారణం ఇదేనా..?
End of Article