YS SHARMILA SON MARRIAGE PHOTOS: ఇటు హిందూ…అటు క్రిస్టియన్…రెండు పద్ధతుల్లో పెళ్లి చేసుకున్న వైఎస్ రాజారెడ్డి – ప్రియా అట్లూరి.!

YS SHARMILA SON MARRIAGE PHOTOS: ఇటు హిందూ…అటు క్రిస్టియన్…రెండు పద్ధతుల్లో పెళ్లి చేసుకున్న వైఎస్ రాజారెడ్డి – ప్రియా అట్లూరి.!

by Harika

Ads

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, ప్రముఖ మత బోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ దంపతుల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం ఘనంగా జరిగింది. పూర్తిగా క్రైస్తవ మత సంప్రదాయం ప్రకారం వైయస్ రాజారెడ్డి, ప్రియ అట్లూరి వివాహం జరిగింది. రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్ పూర్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగిన తన కుమారుడి పెళ్లి ఫోటోలను వైయస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. 16వ తేదీన సంగీత్, మెహందీ వేడుక నిర్వహించగా 17న సాయంత్రం ఐదున్నర గంటలకు వివాహం జరిగింది.18వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి.

Video Advertisement

అటు క్రైస్తవ సంప్రదాయ పద్దతిలో , ఇటు హిందూ సంప్రదాయ పద్దతిలో వివాహ వేడుకలు జరిగాయి. ఇక హిందూ సంప్రదాయ పద్దతిలో జరిగిన పెళ్లిలో వధు, వరులు ఇద్దరూ పట్టు వస్త్రాలు ధరించారు. ముహూర్తం టైం కి మాంగళ్య ధారణ జరిగింది. జీసస్ ముందు క్రైస్తవ మత గురువు రాజారెడ్డి, ప్రియ దంపతులతో ఉంగరాలు తొడిగించారు. కొడుకు వివాహ వేడుకలో వైఎస్ షర్మిల, అనిల్ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే వైయస్ విజయమ్మ కూడా మనవడి వివాహ వేడుకలో పాల్గొన్నారు.

చర్చిలో ఉంగరాలు మార్చుకునే సందర్భంలో తీసిన ఫోటోతో పాటు తన తండ్రి దివంగత వైఎస్ఆర్ ఫోటో వద్ద ఇరు కుటుంబాల సభ్యులు కలిసి దిగిన ఫోటోలు ఆమె తన ఎక్స్ ఖాతా లో పోస్ట్ చేశారు. ఒక తల్లిగా నా జీవితంలో ఇది మరొక సంతోషకరమైన ఘట్టం, వేచి చూసిన ఆ క్షణాలు ఎట్టకేలకు వచ్చాయి సర్వశక్తిమంతుడైన ఆ భగవంతుడి అంతులేని ప్రేమ, కృప, సన్నిహితుల దీవెనలు, శుభాకాంక్షలు తో ఈ శుభకార్యం ఘనంగా జరిగింది.

నా బిడ్డ తన మనసుకు నచ్చిన అమ్మాయిని పెండ్లాడాడు, కొన్ని అద్భుతమైన క్షణాలు ఎప్పటికీ పదిలంగా ఉండిపోతాయి అంటూ షర్మిల ట్వీట్ చేశారు. అయితే ఈ వివాహానికి ప్రియతమ ముఖ్యమంత్రి, పెళ్లి కుమారుడి మేనమామ అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు హాజరు కాలేదు. హైదరాబాదులో జరిగిన మేనల్లుడి ఎంగేజ్మెంట్ కి సతీసమేతంగా హాజరైన జగన్ కి ఆ సమయంలో సరియైన ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రచారం జరిగింది. వైయస్ జగన్ పెళ్ళికి హాజరు కాకపోవడానికి అదే కారణం అంటున్నారు రాజకీయ వర్గాల వారు.అయితే హైదరాబాదులోని శంషాబాద్ ఫోర్ట్ గ్రాండ్ లో నిర్వహించే రాజారెడ్డి వెడ్డింగ్ రిసెప్షన్ కు జగన్ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ రిసెప్షన్ కు జగన్ హాజరైతే సరే సరి,లేదంటే అన్నాచెల్లెళ్ల మధ్య దూరం మరింత పెరిగిందని అనుకోవాలి.


End of Article

You may also like