AP POLITICS: కాంగ్రెస్ లో చేరనున్న షర్మిల…. విజయమ్మ దారి ఎటు…? ఆంధ్ర రాజకీయంలో ఏం జరగబోతుంది.?

AP POLITICS: కాంగ్రెస్ లో చేరనున్న షర్మిల…. విజయమ్మ దారి ఎటు…? ఆంధ్ర రాజకీయంలో ఏం జరగబోతుంది.?

by Mounika Singaluri

Ads

వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైయస్ షర్మిల తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితమే. రాజకీయాల్లో ఆమె చాలా చురుకుగా ఉంటారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసి తర్వాత కొద్ది రోజులు సైలెంట్ అయిపోయారు. మళ్ళీ తిరిగి తెలంగాణలో వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి ఎన్నికల్లో నిలబడతామని చెప్పారు. కానీ ఎన్నికలు వచ్చే సమయానికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి పోటీ నుంచి వైదొలి గారు. కెసిఆర్ ని ఓడించడమే లక్ష్యంగా తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చామని చెప్పుకొచ్చారు. అయితే ఎప్పుడు తెలంగాణ ఎన్నికలు పూర్తయ్యాయి. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ బలపడాలని వ్యూహాలు రచిస్తుంది.

Video Advertisement

ఇందుకోసం షర్మిలాని రంగంలోకి దించాలని చూస్తుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను షర్మిలకు అప్పగించాలని అధిష్టానం నిర్ణయించిందట.వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు షర్మిల సిద్ధమయ్యారు. నాలుగో తేదీన ఢిల్లీలో షర్మిల లాంఛనంగా పని పూర్తి చేస్తారని అంటున్నారు. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ ఢిల్లీ మీడియాకు లీక్ ఇచ్చింది. షర్మిల మంగళవారం ఇడుపుల పాయకు వెళ్తున్నారు. తన కుమారుడి పెళ్లి పత్రికను తండ్రి సమాధి దగ్గర ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈ కార్యక్రమానికి మీడియాను ఆహ్వానించారు. అనంతరం అక్కడ ఆమె తన రాజకీయ భవిష్యత్ గురించి ప్రకటించే అవకాశం ఉంది.

వచ్చే ఎన్నికల్లో కడప నుంచే పోటీ చేసి ఆలోచనలో ఉన్నందున పులివెందులలో ఆమె చేపట్టబోయే కార్యక్రమాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆమె పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తాను పోటీ చేస్తాననే సంకేతాలు ఇస్తే కడప రాజకీయాలు మారిపోయే అవకాశం ఉంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా షర్మిలతో పాటు ఢిల్లీ వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేల్ని చేర్చుకునేందుకు ప్రయత్నిస్తారని అంటున్నారు. అయితే విజయమ్మ ఎటు వైపు అన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది. గతంలో రెండు రాష్ట్రాల్లో ఇద్దరు బిడ్డలు రాజకీయం చేస్తారని ఒకరిపై ఒకరు పోటీ చేయరని క్లారిటీ ఇచ్చారు. కానీ అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదని తేలిపోయింది. ఇప్పుడు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి రెడీ అయ్యారు. విజయమ్మ ఎవరి వైపు ఉంటారన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఆమె రాజకీయంగా బయటకు రాకపోచవచ్చని,కానీ నివాసం మాత్రం షర్మిల ఇంట్లోనేనని భావిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలు మరింత వేడెక్కించేలా మారనున్నాయి…!


End of Article

You may also like