ఈ ఫోటోకి కాప్షన్ చెప్పండి.? వైరల్ అవుతున్న ఒకప్పటి ఫోటో.!

ఈ ఫోటోకి కాప్షన్ చెప్పండి.? వైరల్ అవుతున్న ఒకప్పటి ఫోటో.!

by Mounika Singaluri

Ads

దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కుమార్తె, వైయస్ఆర్ టీపీ అధ్యక్షురాలు, జగన్మోహన్ రెడ్డి సోదరి అయినా షర్మిల ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ సమక్షంలో పీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే షర్మిల కి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే షర్మిల కూడా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే షర్మిల మళ్లీ పాత గూటికే చేరటం కాకతాళీయం అనే చెప్పుకోవచ్చు.

Video Advertisement

ఎందుకంటే ఒకప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీ కోసమే కష్టపడ్డారు. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆ పార్టీకి దూరమైంది వైయస్సార్ కుటుంబం. ఆపై వైయస్ జగన్ సొంతంగా పార్టీ పెట్టడం ఆ పార్టీకి తల్లి, చెల్లి పూర్తి మద్దతు తెలియజేసి వైయస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం కోసం శాయశక్తులా కృషి చేశారు విజయమ్మ, షర్మిల. ప్రజలకి వైయస్ రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న గౌరవం వైయస్ జగన్మోహన్ రెడ్డికి విజయాన్నితెచ్చి పెట్టింది.

అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ కి తన కుటుంబ సభ్యులతో వచ్చిన కలహాల కారణంగా పార్టీ నుంచి బయటికి వచ్చేసారు విజయమ్మ, షర్మిల తర్వాత షర్మిల వైఎస్ఆర్ టీపి పార్టీని స్థాపించింది. వైసీపీ పార్టీ అధ్యక్షుడు పదవికి రాజీనామా చేసిన విజయమ్మ కూడా రాజశేఖర్ రెడ్డి అభిమానులందరూ తన కూతురికి సపోర్ట్ ఇవ్వాలని చెప్పింది. ఆపై ఇప్పుడు షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తూ తాను కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంది.

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఒకప్పటి పాత ఫోటో వైరల్ అవుతుంది. షర్మిల తండ్రి సీఎం రాజశేఖర్ రెడ్డి చనిపోయిన సమయంలో తీవ్ర బాధలో ఉన్న షర్మిలను కాంగ్రెస్ ఆగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఓదారుస్తున్న ఫోటో ఒకటి ఇప్పుడు బయటికి వచ్చింది. ఈ ఫోటోలో వైఎస్ భారతి కూడా కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ ఫోటోపై అనేకమంది అనేక రకాల కామెంట్లు చేస్తున్నారు.


End of Article

You may also like