ప్రేమ పేరుతో కొందరు ఆకతాయిలు వేధిస్తున్నారని అమ్మాయిలు ఫిర్యాదులు చేయడం..ఆత్మహత్యలకి పాల్పడడం మనం చూసాము..! కానీ ఇటీవలి కాలం లో యువతులు ప్రేమ పేరుతో మోసాలు చేస్తున్నారని..యువకులు ప్రాణాలు తీసుకోవటం ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి.నిండు నూరేళ్లు జీవించాల్సిన పసి హృదయాలు..

మధ్యలోనే ఇలా తనువు చాలించేస్తున్నారు.ఇలాంటి ఘటనే ఒకటి పశ్చిమగోదావరి జిల్లా విజయనగరం జిల్లాలో వెలుగులోకివచ్చింది.జక్కం పూడి కనకారావు గా గుర్తించిన పోలీసులు.ప్రేమ పేరుతో.యువతి తన స్నేహితుడు కలిసి చేసిన మోసానికి రైలు క్రింద పడి ప్రాణాలు తీసుకున్నాడు.ప్రేయసి,స్నేహితుడు చేసిన మోసం భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్టు వీడియో రికార్డ్ చేసి దాని బంధువులకి పంపించాడు..దీని పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ప్రేమికుల ఆత్మ హత్యలు ఇటీవలి కాలం లో ఎక్కువవుతున్నాయి..తమ పిల్లలు ఎలాంటి పనులు చేస్తున్నారో ఒక కంట కనిపెట్టి ఉండాలి అని అంటున్నారు..నిపుణులు..!