Ads
దిశ ఇన్సిడెంట్ అప్పుడు డయల్ 100 విషయంలో ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. 100 కి కాల్ చేసినప్పుడు పోలీసులు రెస్పాండ్ అయ్యుంటే దిశ బతికేదని , కేవలం పోలీసుల నిర్లక్ష్యం వల్లే దిశ చనిపోయిందంటూ చాలా మంది విమర్శించారు . కానీ 100కి కాల్ చేస్తే సాల్వ్ అయిన కేసెస్ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికి దిశ ఇన్సిడెంట్ వల్ల చాలా మందికి ఈ టోల్ ఫ్రీనంబర్స్ పట్ల కొంచెం అవగాహన పెరిగింది . కానీ మనం ప్రయాణాల్లో ఉన్నప్పుడు, ముఖ్యంగా రైలు ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఆపద నుండి బయటపడడం ఎలా ? సమాధానం డయల్ 182.
Video Advertisement
మీరు ఒంటరి మహిళా ? ట్రెయిన్లో ప్రయాణిస్తున్నారా ?? ఆకతాయిలు ఆటపట్టిస్తున్నారా??? చుట్టూ సాయం చేయడానికి ఎవరూ లేరా? ఈ ట్రెయిన్లో ఎవరు మనల్ని రక్షిస్తారు అంటూ భయంతో కృంగిపోకండి . ధైర్యం చేసి డయల్ 182 కి కాల్ చేయండి . డయల్ 182 రైల్వే పోలీస్ ఫోర్స్ (RPF) టోల్ ఫ్రీ నంబర్ . ఈ నంబర్ కి కాల్ చేసి మీరు ఏ ట్రెయిన్లో ఉన్నారు , ట్రెయిన్ పేరు, బోగీ నంబరు , అలాగే మీ డీటెయిల్స్ , లొకేషన్ పంపితే మీరు ఆ సమస్య నుండి బయట పడొచ్చు .
కేవలం మహిళలు మాత్రమే కాదు , ప్రయాణిస్తున్న ట్రెయిన్లో ఎలాంటి సమస్య వచ్చినా ,ఎవరైనా ఈ నంబర్ కి కాల్ చేసి సమాచారం అందించొచ్చు . అదే విధంగా కొందరు చేసే ఫేక్ కాల్స్ వల్ల కూడా కొన్నిసార్లు పోలీసులు నిర్లక్ష్యం చేసే పరిస్తితి ఉంటుంది. కాబట్టి మన భద్రత కోసం చేపట్టిన ఇలాంటి వాటిని ఎంత జాగ్రత్తగా వాడుకుంటే మనకే అంత మంచిది. ఈ నంబర్ పట్ల మరింత అవగాహన కోసం ఈ వీడియో చూడండి.
watch video:
End of Article