సాధారణంగా మధ్యాహ్నం సమయంలో సూర్యుడి వెలుగులో నీడ కనిపించకపోతే ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే ఇలాంటి అరుదైన సంఘటన బెంగళూరులో ఏప్రిల్ 25న చోటు చేసుకుంది.

Video Advertisement

ఏప్రిల్ 25న బెంగళూరులోనే కాకుండా మరికొన్ని ప్రాంతాలలో కూడా జీరో షాడో డే చోటు చేసుకుంది. ఇక జీరో షాడో డే అనగా సూర్యుడు వెలుగు మనిషి మీద లేదా ఏదైనా వస్తువు మీద పడినా దాని నీడ కనిపించదు. ఈ అరుదైన దృశ్యం హైదరాబాద్ లో కూడా చోటు చేసుకోనుంది. మరి హైదరాబాద్ లో ఏ రోజున జీరో షాడో డే వస్తుందో ఇప్పుడు చూద్దాం..
సైంటిస్టులు చెప్తున్న దాని ప్రకారంగా బెంగళూరులో ఏప్రిల్ 25 మధ్యాహ్నం 12 గంటల 17 నిముషాలకు ‘ది ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌’ క్యాంపస్‌లో అరవై నుంచి నూట ఇరవై సెకండ్ల పాటు పొడవాటి వస్తువుల యొక్క నీడ కనిపించలేదు. ఈ అరుదైన దృశ్యాన్ని ఎంతో మంది చూశారు. అయితే ఇలాంటి దృశ్యాన్ని చూసే అవకాశం హైదరాబాద్ వాసులకు కలగబోతుందట.
బెంగుళూరులో ఏప్రిల్ 25న జీరో షాడో డే ఏర్పడినపుడు సుమారు 3 నిమిషాల పాటు నీడ కనిపించలేదు. బెంగుళురు వాసులు ఈ అద్భుతమైన దృశ్యాన్ని ఆస్వాదించారు. జీరో షాడో డే చూసే అరుదైన అవకాశం హైదరాబాద్ వాసులకు మే 9న మధ్యాహ్నం 12 గంటల 12 నిముషాలకు కలగనుంది. సాధారణంగా అయితే కర్కాటక రాశి, మకర రాశి మధ్యన ఉండే ప్రాంతాలలో ఈ జీరో షాడో ఏర్పడుతుంది. దానివల్ల ఈ ప్రాంతాలలో ఉండే ప్రజలకు, ఉత్తరాయణం, దక్షిణాయనంలోనూ సూర్యుడి క్షీణత అక్కడ ఉండే అక్షాంశానికి ఈక్వల్ గా ఉంటుంది.
ఆ టైమ్ లో సూర్యుడి కిరణాలు భూమి పైన నిట్ట నిలువుగా ప్రసరిస్తాయి. దానివల్ల నిలువుగా ఉండే ఏ వస్తువులు కానీ, జీవులు నీడను ఏర్పచదు. ఇలాంటి సంఘటన సంవత్సరంలో 2 సార్లు సంభవిస్తుంది. రీసెంట్ గా బెంగళూరులో జీరో షాడో డే ఏర్పడింది. మే 9న హైదరాబాద్ లో ఆవిష్కృతం కానుంది. శాస్త్రవేత్తలు హైదరాబాద్‌లో మే 9న జీరో షాడో డే పగలు 12 గంటల 12 నిముషాలకు ఏర్పడనుందని వెల్లడించారు. గతంలో జీరో షాడో డే 2021లో ఒడిశా, భువనేశ్వర్‌ లో ఏర్పడింది.

Also Read: బీటెక్ చదివిన కూతుర్ని పాప్‌కార్న్ అమ్ముకునే వాడికి ఇచ్చి చేశాడు..! కారణం తెలిస్తే హాట్సాఫ్ అనాల్సిందే..!