Ads
ఎట్టకేలకు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలయ్యింది. సాధారణంగా అయితే ఈ ప్రోగ్రాంలో సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలని మాత్రమే ఎక్కువగా తీసుకుంటారు. కానీ ఈసారి మాత్రం సినిమా రంగానికి చెందిన ప్రముఖులతోపాటు సోషల్ మీడియాకు చెందిన ప్రముఖులను కూడా తీసుకున్నారు. అంతే కాకుండా సీరియల్ నటులు కూడా ఇందులో కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు. మనకి నచ్చిన సెలెబ్రిటీ నిజ జీవితంలో ఎలా ఉంటారో తెలుసుకోవాలనే ఆసక్తి మనలో చాలా మందికి ఉంటుంది.
Video Advertisement
అందుకే ఈ ప్రోగ్రాంకి అంత క్రేజ్ ఉంది. ఈసారి బిగ్ బాస్ తెలుగు-5 కంటెస్టెంట్స్ గా హౌస్ లోకి అడుగు పెట్టిన వారిలో ఒకరు నటి హమీదా ఖాతూన్. హమీదా ఎవరా అని తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. హమీదా పశ్చిమ బెంగాల్ లోని కోల్కతాకు చెందిన వారు. కోల్కతా లోనే తన చదువంతా సాగింది. కోల్కతా విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు హమీదా. తర్వాత తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ కి వచ్చేశారు.
hamida khatoon in bhadram be careful brother
2013లో హైదరాబాద్ కి వచ్చిన హమీదా అప్పటి నుంచి తెలుగు సినిమాల్లో ప్రయత్నం చేయడం మొదలుపెట్టారు. 2015 లో వచ్చిన సాహసం చేయరా డింభకా సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత భద్రం బీ కేర్ ఫుల్ బ్రదర్ అనే సినిమాలో కూడా నటించారు. హమీదా నటి మాత్రమే కాదు. ఇంటీరియర్ డిజైనర్ కూడా. ఇలా నటిగా అలాగే ఇంటీరియర్ డిజైనర్ గా కొనసాగుతున్న హమీదా ప్రస్తుతం బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ప్రేక్షకులను అలరిస్తున్నారు.
End of Article