Ads
ఫస్ట్ వేవ్ కరోనా లాక్ డౌన్ టైం ముగిశాక..విడుదలైన సినిమా “సోలో బతుకే సో బెటర్”. మంచి టాక్ తెచ్చుకుని ఇండస్ట్రీ కి ఓ ధైర్యాన్ని ఇచ్చిన సినిమా ఇది. ఈ సినిమా దర్శకుడే సుబ్బు.. సక్సెస్ వచ్చింది.. అంతా హ్యాపీ అనుకున్న అతని లైఫ్ లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లిగారు శివైక్యం పొందారు. దర్శకుడు సుబ్బు కన్నతల్లి శ్రీ మంగమ్మ గారు నిన్న రాత్రి కరోనా కారణం గా మృత్యువాత పడ్డారు. సమయానికి ఐసియు బెడ్ అందుబాటులో లేకపోవడం తో ఆమె ఈ లోకాన్ని వీడివెళ్లిపోయారు.
Video Advertisement
ఆమె మరణం.. ఐసియు బెడ్ లేకపోవడం అన్న కారణం కూడా బంధుమిత్రులను, సినీ సహచరులను కలచివేస్తోంది. పలువురు ప్రముఖుల బంధువులు కూడా ఇలా మృత్యువాత పడుతున్నారు. ఇటీవలే ఆక్సిజెన్ దొరకక ఓ నటి తన తమ్ముడిని కూడా కాపాడుకోలేకపోయింది. మొన్నా మధ్య సప్తగిరి లక్ష ఖర్చు చేసినా.. తన స్నేహితుడైన దర్శకుడిని బ్రతికించుకోలేకపోయారు. ప్రస్తుతం పరిస్థితులు అలా మారిపోయాయి. డబ్బు తో ప్రాణాలు కొనుక్కోలేము.. జాగ్రత్తలతోనే ప్రాణాన్ని కాపాడుకోగలం. బయటకు వెళ్ళినపుడు కనీస జాగ్రత్తలను పాటించండి.
End of Article