Ads
మహర్షి సినిమా లో హీరోయిన్ పూజ హెగ్డే కదా.. మరి ఈమె ఎవరు అనుకుంటున్నారా..? ఇప్పటి మహర్షి సినిమా కాదులెండి. 1987 లో కూడా “మహర్షి ” సినిమా వచ్చింది. అప్పట్లో ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్ అయ్యి సంచలనం సృష్టించింది. ఈ సినిమా లో “మాట రాని మౌనమిది..” , “సుమం.. ప్రతి సుమం సుమం..” సాంగ్స్ ను ఇళయరాజా స్వరపరిచారు. ఈ పాటలు అప్పట్లోనే ఓ సెన్సేషన్. ఇప్పటికి ఈ సాంగ్స్ కి ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
Video Advertisement
ఈ సినిమాకి వంశి దర్శకత్వం వహించారు. శాంతి ప్రియ, రాఘవ ఈ సినిమా లో హీరో హీరోయిన్లు గా నటించారు. శాంతి ప్రియ ఎవరో కాదు. ప్రముఖ హీరోయిన్ భానుప్రియ కు స్వయానా చెల్లెలు. అక్క చెల్లెళ్ళు ఇద్దరు సినీ ఇండస్ట్రీ లో మంచి పేరే సంపాదించుకున్నారు. 1987 లోనే శాంతి ప్రియ “ఊరు ఎంగ పాటుక్రన్” అనే తమిళ సినిమా లో కూడా నటించారు. ఆ తరువాత “మహర్షి” చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు కూడా శాంతి పరిచయమయ్యారు.
జగపతి బాబు తో కలిసి “సింహ స్వప్నం” అనే సినిమా లో కూడా నటించారు. ఆ తరువాత శిలా శాసనం, రక్త కన్నీరు, జస్టిస్ రుద్రమ దేవి వంటి సినిమాలలో కూడా నటించారు. ఆమెకు బాలీవుడ్ లో కూడా అవకాశాలు వచ్చాయి. అక్షయ్ కుమార్ హీరో గా “సుగంధ్ ” అనే సినిమాలో కూడా నటించారు. బాలీవుడ్ లో ఆఫర్స్ రావడం తో.. తెలుగు అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తరువాత ఆమె వి. శాంతారామ్ మనవడు సిద్ధార్థ్ రాయ్ ను వివాహం చేసుకున్నారు.
వీరు చాలా అన్యోన్యం గా ఉండేవారు. ఉన్నట్లుండి వీరి జీవితం లో విషాదం చోటు చేసుకుంది. 2004 లో సిద్ధార్థ్ రాయ్ గుండె పోటు కారణం గా మృతి చెందారు. ఆ తరువాత దాదాపు ఏడేళ్లకాలం పాటు ఆమె ప్రేక్షకులకి, మీడియా కి దూరం గా ఉన్నారు. 2011 లో మహా అక్షయ్ నటించిన “హామిల్టన్” అనే హిందీ సినిమాలో కీలక పాత్ర పోషించారు. తన నటన, హావభావాలతో ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్న శాంతి ప్రియ తిరిగి సినిమాల్లోకి రావాలను తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
Watch Video:
End of Article