సుకుమార్ కి ముందు..సుకుమార్ కి తరువాత.! ఈ 8 హీరోలు ఎలా మారిపోయారో చూడండి..!

సుకుమార్ కి ముందు..సుకుమార్ కి తరువాత.! ఈ 8 హీరోలు ఎలా మారిపోయారో చూడండి..!

by Anudeep

Ads

దర్శకుడి గా సక్సెస్ అవ్వడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క థీమ్ ని, ఒక్కో డైరెక్షన్ స్టైల్ ని ఫాలో అవుతుంటారు. అవి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటే వారు ఫేమస్ అయిపోతారు. టాలీవుడ్ లో ఒక్కొక్క దర్శకుడిది ఒక్కక్క స్టైల్. అలానే సుకుమార్ ది కూడా.. చాలా భిన్నం గా సినిమాలు తీయడం లో సుకుమార్ దిట్ట. హీరోల క్యారెక్టర్ లు, అప్పియరెన్స్ ల విషయం లో కూడా సుకుమార్ చాలా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాడు. ఈ సినిమా ల లిస్ట్ చూస్తే ఆ విషయాన్నీ మీరు కూడా ఒప్పుకుంటారు.

Video Advertisement

#1 హీరో రామ్ : దేవదాస్ – జగడం

దేవదాస్ లోను, జగడం సినిమాలోనూ రామ్ మాస్ హీరో గానే చేసారు. కానీ ఈ రెండు మాస్ క్యారెక్టర్ల లోను చాలా వేరియేషన్ ఉంటుంది. అది సుకుమార్ మార్క్ అని స్పష్టం గా మనకి తెలిసిపోతుంది.

#2 అల్లు అర్జున్ : గంగోత్రి – ఆర్య


గంగోత్రి సినిమాలో స్కూల్ పిల్లాడి లా కనిపించిన మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను ఓ రేంజ్ లో మేక్ ఓవర్ చేసాడు సుకుమార్. కాలేజీ కుర్రాడి లా ఆర్య సినిమాలో బన్నీ ఎంత అక్కట్టుకున్నాడో కదా. ఆ బన్నీ ని మనం ఇప్పటికి మర్చిపోము. ఆ క్యారెక్టర్ కి వన్ సైడ్ లవ్ కాన్సెప్ట్ ను ఆడ్ చేసి సినిమా ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు.

#3 అల్లు అర్జున్ : ఆర్య – ఆర్య 2


సినిమా సినిమా కి అల్లు అర్జున్ స్టైల్ ఎలా మైంటైన్ చేస్తాడో.. అలానే సుకుమార్ కూడా హీరో ని బట్టి స్టైల్, ఆటిట్యూడ్, క్యారెక్టర్ ని డిజైన్ చేసాడు. ఈ సుకుమార్ కి బన్నీ కి బాగా కుదిరింది. అందుకే ఆర్య లానే ఆర్య 2 కూడా మర్చిపోలేని సినిమా అయింది. ఈ సినిమాలో సాఫ్ట్ వెర్ ఎంప్లాయ్ గా, ఫార్మల్స్ లో , లాంగ్ హెయిర్ లుక్ తో బన్నీ ని చాలా డిఫరెంట్ గా చూపించాడు సుకుమార్.

#4 జూనియర్ ఎన్టీఆర్ – టెంపర్ – నాన్నకు ప్రేమతో


జూనియర్ ఎన్టీఆర్ కూడా సినిమా సినిమా కి డిఫరెంట్ థీమ్ లో స్టయిల్ ఎంచుకుంటారు. టెంపర్ సినిమాలో కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ గా మాస్ టైపు లో అలరించిన ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా కి వచ్చేసరికి సాఫ్ట్ అండ్ అల్ట్రా స్టైలిష్ గా మార్చేశాడు సుకుమార్. అసలు ఆ బీర్డ్ లుక్ లో కూల్ గా తారక్ ని స్క్రీన్ పై ప్రెజెంట్ చేసాడు.

#5 మహేష్ బాబు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు- నేనొక్కడినే


సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సాఫ్ట్ గా కూల్ గా ఉన్న చిన్నోడిని నేనొక్కడినే సినిమా కి వచ్చేసరికి రాక్ స్టార్ గా మార్చేశాడు.

#6 అల్లు అర్జున్ – అలవైకుంఠపురం లో – పుష్ప


పుష్ప అల్లు అర్జున్ కి సుకుమార్ కి మరో సారి సెట్ అవుతోంది. ఇంతకుముందు కాంబోలలో ఇరగదీసినట్లే ఈ కాంబో లో కూడా ఇరగదీయనున్నారు. అల వైకుంఠ పురం సినిమాలో మిడిల్ క్లాస్ బాయ్ క్లాస్ లుక్ నుంచి..ఊర మాస్ గెట్ అప్ లోకి మార్చేశాడు. ఈ మేక్ ఓవర్ చూస్తే సుకుమార్ మార్క్ అంతే అని అనిపిస్తుంది.

#7 రామ్ చరణ్ – ధ్రువ – రంగస్థలం


రంగస్థలం లో చరణ్ పాత్ర హైలైట్ అసలు. ధ్రువ సినిమా లో సిన్సియర్ హ్యాండ్ సామ్ ఆఫీసర్ గా కనిపించిన రామ్ చరణ్ రంగస్థలం లో చిట్టిబాబు గా కంప్లీట్ ట్రాన్స్ ఫార్మ్ అయిపోయారు. చిట్టిబాబు పాత్ర ఏ రేంజ్ లో రీ సౌండ్ చేసిందో మనకి తెల్సిందే.

#8 నాగ చైతన్య : ఏ మాయ చేసావే – 100 % లవ్


ఏ మాయ చేసావే సినిమా లో నాగ చైతన్య కి 100 % లవ్ లో బాలు కు చెప్పలేనంత వేరియేషన్ ఉంది. క్లాస్ లవర్ బాయ్ లుక్ లో నుంచి కన్నింగ్ ఇంటెలిజెంట్ గా నాగ చైతన్య స్క్రీన్ ప్రెజన్స్ అద్భుతం గా ఉంటుంది.

 


End of Article

You may also like