రెండవ T20 లో ఇంగ్లాండ్ పై ఇండియా మ్యాచ్ గెలవడంపై ట్రెండ్ అవుతున్న 25 మీమ్స్.!

రెండవ T20 లో ఇంగ్లాండ్ పై ఇండియా మ్యాచ్ గెలవడంపై ట్రెండ్ అవుతున్న 25 మీమ్స్.!

by Mohana Priya

Ads

అహ్మదాబాద్ వేదికగా టీమ్ ఇండియాకి ఇంగ్లాండ్ కి జరిగిన టి20 రెండవ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఇంగ్లండ్ జట్టు నుండి మొదట బ్యాటింగ్ ఓపెనర్ జోస్ బట్లర్‌ (0)ని మొదటి ఓవర్‌ లోనే భువనేశ్వర్ కుమార్ గోల్డెన్ డక్‌ గా అవుట్ చేశారు. తర్వాత వచ్చిన డేవిడ్ మలాన్ (24: 23 బంతుల్లో 4×4) తో కలిసి చేసిన జేసన్ రాయ్ (46: 35 బంతుల్లో 4×4, 2×6) మెరుపు ఇన్నింగ్స్ తో రెండవ వికెట్ కి 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తర్వాత కొంచెం సేపటికి జేసన్ రాయ్ వికెట్ చేజార్చుకున్నారు.

Video Advertisement

memes on india wining t20 in ind vs eng

జానీ బెయిర్‌స్టో (20), ఇయాన్ మోర్గాన్ (28), బెన్‌స్టోక్స్ (24) క్రీజ్ లో ఉన్నంత సేపు భారీ ఓట్లకు ప్రయత్నించి స్కోర్ పెంచే ప్రయత్నం చేశారు. ఇంగ్లాండ్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఇంగ్లాండ్ 164 పరుగుల స్కోర్ చేసింది. టీమిండియా బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్ రెండు వికెట్లు, వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు, భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్, చాహల్ ఒక వికెట్ పడగొట్టారు. తర్వాత ఇన్నింగ్స్ మొదలు పెట్టిన టీమిండియాలో కెప్టెన్ విరాట్ కోహ్లీ (73 నాటౌట్: 49 బంతుల్లో 5×4, 3×6), ఓపెనర్ ఇషాన్ కిషన్ (56: 32 బంతుల్లో 5×4, 4×6) హాఫ్ సెంచరీ చేయడంతో 7 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 73 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. అంతర్జాతీయ టీ20ల్లో 3,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఫస్ట్ క్రికెటర్‌గా రికార్డ్ సాధించారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18#19#20#21 #22#23#24#25


End of Article

You may also like